రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ముని సీక్వెల్ లో తెరకెక్కిన కాంచన 3 సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా గతంలో వచ్చిన ముని, కాంచన, గంగ సినిమాల మాదిరి విజయం సాధించిందా?లేదా? అన్నది తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, నిక్కి తంబోలి, కొవైసరళ, కభీర్ దుహన్ సింగ్, శ్రీమన్, దేవదర్శిని, కిషోర్ తదితరులు
దర్శకత్వం : రాఘవ లారెన్స్
నిర్మాత : రాఘవ లారెన్స్
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫి : వెట్రి, సర్వేష్ మురారి
కథ :
దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మామయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి. ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవదర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.
విశ్లేషణ :
కొరియోగ్రాఫర్ గా తన స్టెప్పులతో తనలోని టాలెంట్ ను చూపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఆతరువాత డైరెక్టర్ గా కూడా మారి తనలో ఉన్న మరో యాంగిల్ ను చూపించాడు. డైరెక్టర్ గా కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన కాంచన 3 సినిమాతో కూడా లారెన్స్ మరోసారి తన సత్తా చాటినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే గత సిరీస్ లతో పోల్చుకుంటే అదిరిపోయే హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కాంచన 3 ను డబుల్ మాస్ గా తెరకెక్కించాడు లారెన్స్. రాఘవ , కాళి రెండు పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఒకపక్క కామెడీ అందిస్తూనే హారర్ సీన్స్.. ఎమోషన్ సీన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ.. మరోసారి తన విశ్వరూపం చూపించాడు లారెన్స్. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ అలరించింది. ఊహించిన కథే అయినా మళ్ళీ ఓ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ తో, కామెడీతో మేజిక్ చేసాడు లారెన్స్.
ఇక హీరోయిన్స్ ఓవియా, వేదిక తమ పాత్రలకు న్యాయం చేశారు. అంతేకాదు ముని సినిమా నుండి ఈ సీక్వెల్ వరకూ కొనసాగుతున్న కోవై సరళ ఈసినిమా లో కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. శ్రీమాన్, దేవ దర్శిని మరోసారి కామెడీ పండించి బెస్ట్ అనిపించుకున్నారు. సూరి క్యారెక్టర్ చిన్నదే అయినా తన మార్క్ కామెడీతో అలరించాడు. అనుపమ కుమార్ క్యారెక్టర్ బాగుంది. కబీర్ సింగ్ విలనిజంతో పరవాలేదనిపించుకున్నాడు. మిగతా నటీ నటులంతా వారి పాత్రలకు న్యాయం చేసారు.
ముఖ్యంగా ఈసినిమాకు ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆ విషయంలో తమన్ ను మెచ్చుకోవాలి. తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ కూడా హైలైట్ గా నిలిచాయి. లారెన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తాయి.
ఓవరాల్ గా ఈసినిమా హార్రర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే కాదు..అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పొచ్చు.
[wp-review id=”19376″]
[subscribe]
[youtube_video videoid=9xGLD-XIEq8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: