కోలీవుడ్ లో స్టార్ హీరో గా వెలుగొందుతున్న జయం రవి సిల్వర్ జూబ్లీ మూవీ ఒక సోషల్ మెసేజ్ తో రూపొందనుంది. నిర్మాత సుజాత విజయ్ కుమార్ (జయం రవి మదర్ ఇన్ లా ) నిర్మాణ సారథ్యం లో హిట్ మూవీస్ రోమియో జూలియట్, బోగన్ చిత్రాల దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం లో జయం రవి 25 వ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనకు ఈ మూవీ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలని, హీరో జయం రవి రైతు పాత్ర లో నటిస్తారని, అగ్రికల్చర్ మూవీ అని, సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథ ని దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జయం రవి లుక్ డిఫరెంట్ గా ఉంటుందని, జూన్ నెల 5వ తేదీ షూటింగ్ ప్రారంభమౌతుందని, D ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు.
సెన్సేషనల్ హిట్ జయం మూవీ తో కోలీవుడ్ కు హీరోగా ఎంటరయిన రవి ఆ మూవీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. జయం రవి నటించిన పలు తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. పగ, పౌరుడు, రణధీర, టిక్ టిక్ టిక్ వంటి డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు జయం రవి పరిచయమే. జండా పై కపిరాజు తెలుగు మూవీ లో జయం రవి అతిథి పాత్ర లో నటించారు.
[subscribe]
[youtube_video videoid=sX7MKDM8wxU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: