మహేష్ బాబు నటిస్తున్న సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వారి ఎదురుచూపులకు ఊరటగా.. రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ మహేష్ తన అభిమానులను హ్యాపీ చేస్తూనే ఉన్నాడు. ఇక గత కొద్ది కాలంగా జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ కు కూడా నిన్ననే కొబ్బరికాయ కొట్టారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. మే 9న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బిజీ బిజీగా చేసేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఈ సినిమా నుండి ఇప్పటికే ఛోటీ ఛోటీ బాతేన్, నువ్వే సమస్తం అనే పాటలు రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి దేవి మ్యాజిక్ ఇప్పుడు కనిపిస్తుందన్న ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఎవరెస్ట్ అంచున అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈపాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి..
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సోషల్ మెసేజ్ తో పాటు , పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=E_nsZAGJHOM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: