`బ్ర‌హ్మోత్స‌వం` రీమేక్ కానుందా?

Brahmotsavam Remake On Charts?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Brahmotsavam Movie Remake Latest Updates,Kollywood Director Plans For Brahmotsavam Remake,Tamil Director To Make a Remake Of Brahmotsavam,Mahesh Babu Brahmotsavam Remake in Tamil
Brahmotsavam Remake On Charts?

ఒక్కోసారి కాన్సెప్ట్ బాగున్నా… బ్యాడ్ ఎగ్జిక్యూష‌న్ కార‌ణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి చిత్రాల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బ్ర‌హ్మోత్స‌వం ఒక‌టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏడు త‌రాల‌కు చెందిన త‌న బంధువులను వెతుకుతూ… అనేక ఊర్లు తిరిగి చివ‌రికి వారంద‌రిని ఒక చోట చేర్చే ఓ యువ‌కుడి క‌థే బ్ర‌హ్మోత్స‌వం. కుటుంబ విలువ‌ల‌కు, మాన‌వ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ ఈ చిత్ర క‌థ‌ను తీర్చిదిద్దిన‌ప్ప‌టికీ… సినిమాగా మ‌లచిన తీరు మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. ఫ‌లితంగా… భారీ తారాగ‌ణంతో భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచింది.

అయితే… ఈ క‌థ‌లో ఉన్న ఫీల్‌, ఎమోష‌న్ త‌న‌ను క‌ట్టిప‌డేయ‌డంతో ఓ సెన్సిబుల్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేయ‌బోతున్నాడని టాక్‌. ఆ ద‌ర్శ‌కుడే… చేర‌న్‌. ఫీల్ గుడ్ మూవీ ఆటోగ్రాఫ్‌ (నా ఆటోగ్రాఫ్‌ ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌)తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చేర‌న్‌… ఇప్పుడు బ్రహ్మోత్స‌వం చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట‌.

చ‌రిత్ర‌లో హిట్ సినిమాల రీమేక్‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉండి… ఫ్లాప్ సినిమాల రీమేక్‌ల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నా… స‌రైన ఎగ్జిక్యూష‌న్‌తో ఫ్లాప్ సినిమాలు కూడా అద్భుతంగా రీమేక్ అయి విజ‌యాలు పొందిన దాఖ‌లాలు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నాయి. మ‌రి… బ్ర‌హ్మోత్స‌వం కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూద్దాం…

[subscribe]


[youtube_video videoid=TEFpCVXNc7U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.