పూరీ జ‌గ‌న్నాథ్ తొలి చిత్రం ‘బ‌ద్రి’కి 19 ఏళ్ళు

19 Years For Power Star Pawan Kalyan Badri Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Power Star Pawan Kalyan Badri Movie Latest Updates,Pawan Kalyan Badri Movie Completes 19 Years,19 Years For Badri Movie,19 Years Turns For Power Star Badri Movie
19 Years For Power Star Pawan Kalyan Badri Movie

డైరెక్టర్ కావడానికి ఎన్నో కష్టాలు పడుతూ తిరుగుతున్న రోజులవి. చేతికొచ్చిన సినిమాలు ఒక్కోటి ఆగిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం. గురువు కృష్ణవంశీ ఒకే మాట చెప్పాడు… “నీలోని టాలెంట్‌ను గుర్తించే హీరోతో సినిమా చెయ్” అని. కాని మనసులో ఒకటే ప్రశ్న… “నాలోని టాలెంట్ గుర్తించే హీరో ఎవరు?”… వెంటనే వినిపించిన సమాధానం “పవన్ కళ్యాణ్”. ఆ సినిమా రెడీ. అదే ‘బద్రి’. రిజ‌ల్ట్‌… బ్లాక్ బస్టర్ హిట్. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో ఈ పాటికే అర్థ‌మైపోయి ఉంటుంది. య‌స్‌… పూరీ జ‌గ‌న్నాథ్‌. దర్శకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రమ‌ది. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు పూరి. దర్శకుడిగా మాత్రమే కాకుండా… కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా తానే రాసుకుని చిత్రాన్ని రూపొందించిన‌ తీరు అంద‌రినీ క‌ట్టిప‌డేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’… ఇలా హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న పవన్ కళ్యాణ్‌ను గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశాడు పూరి. ముఖ్యంగా… నువ్వు నంద‌వైతే ఏంటి... నేను బ‌ద్రి... బ‌ద్రీనాథ్‌ అని ప‌వ‌న్‌ చెప్పే డైలాగ్ అయితే ఇప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. కాగా… ఇందులో పవన్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల్ కథానాయికలుగా నటించారు. వాళ్ళిద్ద‌రికి ఇదే తొలి తెలుగు చిత్రం కావ‌డం విశేషం. విజయలక్ష్మి మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రంలో… ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, మల్లికార్జునరావు, ఎం.ఎస్.నారాయణ, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

‘తమ్ముడు’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో రమణ గోగుల అందించిన మరో మ్యూజికల్ హిట్ ఇది. ఈ చిత్రంలోని పాటలన్నీ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా… ఇప్పటికీ “ఐ యామ్ ఏన్ ఇండియన్”, “బంగాళాఖాతంలో”, “హే చికితా” పాట‌లు ఎక్క‌డో ఓ చోట‌ వినిపిస్తూనే ఉంటాయి. ఇక “వేవేల వర్ణాల” పాటైతే మంచి రొమాంటిక్ టచ్ ఉన్న గీతంగా గుర్తుండిపోతుంది. 85 కేంద్రాల‌లో అర్ధ శతదినోత్సవం, 47 కేంద్రాల‌లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా… యు.ఎస్.లో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. 2000 ఏప్రిల్ 20న విడుదలైన పూరి ఫ‌స్ట్ డైరెక్టోరియ‌ల్ మూవీ ‘బద్రి’… నేటితో 19 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]


[youtube_video videoid=Z2oyjNKGyNY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =