ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 28
సాహో మూవీ కి మొదలయిన కౌంట్ డౌన్
సాహో సృష్టిస్తున్న కొత్త రికార్డులు
మన్మథుడు 2 టీజర్ రిలీజ్
'సాహో' టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్
మరోసారి సుజీత్ కు 'సాహో'

2019 సెకండాఫ్‌లోనూ స్టార్స్ సందడి
తెలుగు లో డబ్బింగ్ చెప్పిన శ్రద్ధా కపూర్

విజువల్ ట్రీట్ సాహో టీజర్ రిలీజ్

సాహో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్

'ఫస్ట్ ర్యాంక్ రాజు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజయిన చాణక్య మూవీ ఫస్ట్ లుక్

" క్లాప్ " కొట్టిన నాని, ఇళయరాజా

బాలీవుడ్ హిట్ థ్రిల్లర్ రీమేక్ లో సునీల్

నితిన్ 'భీష్మ' మొదలు

#NKR17అఫీషియల్ అనౌన్స్ మెంట్

పెళ్లిచూపులు డైరెక్టర్ తో వెంకీ

కాశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్
సాహో హిందీ వెర్షన్ కు ప్రభాస్ స్వంత వాయిస్
బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీతో ప్రపంచ ప్రఖ్యాతిపొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో ప్రభాస్ కు క్రేజ్ అధికంగా ఉంది. ప్రభాస్ కు బాలీవుడ్ మూవీస్ లో ఆఫర్స్ వచ్చినా నటించలేదు. హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో రూపొందిన సాహో మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయ మవుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ హయ్యస్ట్ గ్రాసర్స్ అందుకున్న `దిల్` రాజు
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత `దిల్` రాజు. 16 ఏళ్ళ నిర్మాణప్రస్థానంలో 32కి పైగా చిత్రాలను నిర్మించాడు రాజు. అంటే... ఏడాదికి సగటున రెండు చిత్రాలను అందించిన వైనం రాజు సొంతం అన్నమాట. ఇదిలా ఉంటే... ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలను (ఎఫ్ 2, మహర్షి) అందించిన రాజుకి... ఆ యా చిత్రాలు కెరీర్లో ప్రత్యేకంగా నిలవడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హయ్యస్ట్ గ్రాసర్స్ మూవీస్ అయ్యాయి.
సాహో మూవీ కి మొదలయిన కౌంట్ డౌన్
UV క్రియేషన్స్ , T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 64 రోజులలో రిలీజ్ కానున్న సాహో మూవీ కి కౌంట్ డౌన్ మొదలయింది. తెలుగు, తమిళ,హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే , మురళీశర్మ, వెన్నెల కిషోర్, ఎవలిన్ శర్మ, మందిరా బేడి, స్రబంతి ఛటర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
సాహో సృష్టిస్తున్న కొత్త రికార్డులు
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపుతెచ్చుకోవడంతో.. టీజర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. అన్ని భాషలకు చెందిన ఇండస్ట్రీ వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు ఇన్ని రోజులు. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో టీజర్ ను రిలీజ్ చేశారు.
మన్మథుడు 2 టీజర్ రిలీజ్
2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
'సాహో' టీజర్ పై సెలబ్రిటీల రియాక్షన్
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో టీజర్ ను ఈరోజు చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూసిన అభిమానులు కూడా చాలా సంతోషంలో ఉన్నారు. తమ అభిమాన హీరో నుండి ఈ రేంజ్ లో ఉన్న సినిమా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ టీజర్ చూసిన సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరెవరు ఎలా ప్రశంసించారో చూద్దాం...
మరోసారి సుజీత్ కు 'సాహో'
ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 300 కోట్ల బడ్జెట్.. అది కూడా ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ కాదు.. కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన డైరెక్టర్.. తనని నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం నిజంగా నిర్మాతల గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆ డైరెక్టర్ ఎవరో అర్ధమైపోయిఉంటుంది. ఒక్క సినిమా హిట్ తో ఏకంగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు.

2019 సెకండాఫ్‌లోనూ స్టార్స్ సందడి
ఫలితాల సంగతి పక్కన పెడితే... ఈ ఏడాది ప్రథమార్ధంలో ఐదు అగ్ర కథానాయకుల చిత్రాలు సందడి చేశాయి. జనవరిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన `యన్టీఆర్ కథానాయకుడు`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `వినయ విధేయ రామ`, విక్టరీ వెంకటేష్ `ఎఫ్ 2` విడుదల కాగా... ఫిబ్రవరిలో బాలయ్య `యన్టీఆర్ మహానాయకుడు` రిలీజైంది. ఇక మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `మహర్షి` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాలన్నీ ఆ యా కథానాయకుల అభిమానులను అలరించాయి.
తెలుగు లో డబ్బింగ్ చెప్పిన శ్రద్ధా కపూర్
ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సాహో మూవీ లో తెలుగు డైలాగ్స్ పెర్ ఫెక్ట్ గా పలకడానికి చాలా హార్డ్ వర్క్ చేసిన శ్రద్ధా కపూర్ తెలుగు లో డబ్బింగ్ చెప్పాలనే కోరికను దర్శకుడు సుజీత్ వద్ద వెల్లడించారు. సుజీత్ అంగీకరించడంతో తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

విజువల్ ట్రీట్ సాహో టీజర్ రిలీజ్
సాహో.. సాహో.. సాహో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తుంది ప్రస్తుతం. ఇప్పటికే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలతో సాహోపై అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్. అప్పుడప్పుడు ఈ సినిమా నుండి పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే ఎప్పుడైతే టీజర్ అప్ డేట్ ఇచ్చారో ఆ రోజు నుండి ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో చేసిన స్టంట్స్ ఎప్పుడు చూస్తామా అని టీజర్ కోసం చూస్తున్నారు. ఇక వారి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

సాహో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్
ప్రభాస్ అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను.. యాక్షన్ సీన్స్ ను చూసేద్దామా అని అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రతి సినీ అభిమాని కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా... నిన్న రాత్రి విడుదల చేసిన పోస్టర్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

'ఫస్ట్ ర్యాంక్ రాజు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

నయా ట్రెండ్ - తెలంగాణ స్లాంగ్ తో హిట్ కొడుతున్న హీరోలు
సినీ పరిశ్రమలో ఒక్కో టైమ్ కి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. గత కొద్దికాలంగా ఏ పరిశ్రమలో చూసినా బయోపిక్ ల హవానే నడిచింది.. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇంకా రీమేక్ హవా కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగులో మాత్రం నయా ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. అదే తెలంగాణ స్లాంగ్. ఒకప్పుడు సినిమాల్లో పెద్దగా వినిపించని ఈ స్లాంగ్ ఇప్పుడు మాత్రం సినిమాలు హిట్టవడానికి కారణమవుతుంది. యూత్ ఈ స్లాంగ్ కు ఫిదా అవుతున్నారు. ఇక దర్శకులు కూడా ఈ స్లాంగ్ తో స్పెషల్ స్క్రిప్ట్ లను సైతం రాస్తున్నారు. బెస్ట్ క్యారెక్టర్స్ ని సృష్టిస్తున్నారు.

రిలీజయిన చాణక్య మూవీ ఫస్ట్ లుక్
యాక్షన్ స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో స్పై థిల్లర్ మూవీ చాణక్య రూపొందుతున్న విషయం తెలిసిందే. 2001 సంవత్సరంలో తొలి వలపు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన గోపి చంద్, ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాలలో నటించి సూపర్ హిట్ మూవీ యజ్ఞం తో హీరోగా సెటిల్ అయ్యారు. గోపి చంద్ నటించిన ఆంధ్రుడు , రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్, సాహసం, లౌక్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

" క్లాప్ " కొట్టిన నాని, ఇళయరాజా
బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్ పై ఆది పినిశెట్టి హీరోగా పృథ్వి ఆదిత్య దర్శకత్వం లో స్పోర్ట్స్ నేపథ్యం లో రూపొందనున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం క్లాప్ ఈ రోజు ప్రారంభమైంది. తెలుగు వెర్షన్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా క్లాప్ కొట్టగా, తమిళ వెర్షన్ కు హీరో నాని క్లాప్ కొట్టారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్విచ్ ఆన్ చేశారు. ఆకాంక్ష సింగ్ కథానాయిక.

బాలీవుడ్ హిట్ థ్రిల్లర్ రీమేక్ లో సునీల్
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది కాబట్టి ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

నితిన్ 'భీష్మ' మొదలు
'లై', 'ఛల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం' ఇలా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో మరో సినిమాను పట్టాలెక్కించడానికి నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాను తెరకెక్కించనున్నట్టు ఎప్పుడో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు.

#NKR17అఫీషియల్ అనౌన్స్ మెంట్
'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం' లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు గత కొద్దిరోలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకు గాను ఈ మూవీ ని అధికారికంగా నేడు చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

పెళ్లిచూపులు డైరెక్టర్ తో వెంకీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద సెక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా పొంగల్ విన్నర్ గా నిలిచి అత్యధిక వసూళ్లను రాబట్టింది. వెంకీ, వరుణ్ తోపాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కు కూడా కెరీర్ బెస్ట్ వసూళ్లను అందించింది.

కాశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్
సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మే 31 వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. MB ఎంటర్ టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లో రష్మిక మందన్న కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా సంవత్సరాల విరామంతరువాత విజయశాంతి ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం.