మరోసారి సుజీత్ కు ‘సాహో’

Sujeeth Shocks Everyone With Saaho Teaser,Telugu Filmnagar,Telugu Film Updtaes,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sujeeth Hits A Jackpot With Saaho,Director Sujeeth Gets Jackpot With Saaho,Director Sujeeth About Saaho,Sujeeth Next Film Updates
Sujeeth Shocks Everyone With Saaho Teaser

ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 300 కోట్ల బడ్జెట్.. అది కూడా ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ కాదు.. కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన డైరెక్టర్.. తనని నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం నిజంగా నిర్మాతల గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆ డైరెక్టర్ ఎవరో అర్ధమైపోయిఉంటుంది. ఒక్క సినిమా హిట్ తో ఏకంగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక్క సినిమాకే ఇలాంటి ఛాన్స్ కొట్టేస్తే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవ్వకుండా ఉంటుందా..? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఒక పక్క సుజీత్ కు అంత సీన్ ఉందా అని అంటూనే మరోపక్క ప్రభాస్ కు సుజీత్ పై అంత నమ్మకం ఏంటి?… ఏం నమ్మి సుజిత్ కు అంత అవకాశం ఇచ్చాడు అన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. అయితే దానికి షేడ్స్ ఆఫ్ సాహో అంటూ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసి అందరికీ సమాధానం చెప్పాడు. ఆ వీడియోస్ తరువాత సుజిత్ పై అందరూ ప్రశంసలు కురిపించారు.

ఇక ఇప్పుడు మరోసారి సుజీత్ అందరికీ తన టీజర్ తో సమాధానం చెప్పాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈరోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా నాలుగు భాషల్లో ఒకేసారి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ పై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినిమా టీజరా లేక హాలీవుడ్ సినిమా టీజరా అన్నట్టు ఉందని.. మేకింగ్ హాలీవుడ్ సినిమాలా ఉంద‌ని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఈ టీజర్ ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నట్టు తెలుపుతున్నారు. దీంతో ప్ర‌భాస్ ఏదైతే న‌మ్మ‌కం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేశాడనిపిస్తుంది. విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో క్లారిటీ వచ్చేసింది అందరికీ. మరి టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. ఆ ఊహ అభిమానులకే వదిలేస్తున్నాం..

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =