బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందుకున్న `దిల్‌` రాజు

Back To Back Highest Grossers For Blockbuster Movies Producer Dil Raju,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Producer Dil Raju New Movie Updates,Highest Grossers Blockbuster Telugu Movies,Producer Dil Raju Upcoming Film News
Back To Back Highest Grossers For Blockbuster Movies Producer Dil Raju

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత `దిల్‌` రాజు. 16 ఏళ్ళ నిర్మాణ‌ప్ర‌స్థానంలో 32కి పైగా చిత్రాల‌ను నిర్మించాడు రాజు. అంటే… ఏడాదికి స‌గ‌టున రెండు చిత్రాల‌ను అందించిన వైనం రాజు సొంతం అన్న‌మాట‌. ఇదిలా ఉంటే… ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు సినిమాలను (ఎఫ్ 2, మ‌హ‌ర్షి) అందించిన రాజుకి… ఆ యా చిత్రాలు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌వ‌డ‌మే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ మూవీస్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` విష‌యం తీసుకుంటే అప్ప‌టివ‌ర‌కు రాజు నిర్మించిన చిత్రాల కంటే మిన్న‌గా ఈ సినిమా వ‌సూళ్ళు చూసింది. అంతేకాదు, అప్ప‌టికి హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అనిపించుకుంది. కట్ చేస్తే… నాలుగు నెల‌లు తిరిగేస‌రికి స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌చ్చిన `మ‌హ‌ర్షి`… `ఎఫ్ 2` కంటే మిన్న‌గా వ‌సూళ్ళు చూసి రాజు కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది. సో… ఇలా బ్యాక్ టు బ్యాక్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందించి 2019 సంవ‌త్స‌రం `దిల్` రాజుకి స్పెష‌ల్ ఇయ‌ర్‌గా నిల‌చింద‌న్న‌మాట‌. మున్ముందు ఇంత‌కుమించిన విజ‌యాలను రాజు అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=d7pKlI6b2zc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =