ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 27
'ఎన్జీకే' క్లోజింగ్ కలెక్షన్స్

24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు
క్రేజీ ప్రాజెక్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్?

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
అనుష్క 'నిశ్శబ్దం'... 25% షూటింగ్ పూర్తి

'ఆర్ఆర్ఆర్'... ఓవర్సీస్ బిజినెస్ అదుర్స్

'సాహో'కి సుజీత్ సెంటిమెంట్

స్పైడర్ మాన్ మూవీ తో సాహో
మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా

స్క్రీన్ ప్లే ఆధారిత యాక్షన్ మూవీ సాహో -ప్రభాస్
సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్

గెస్ ప్రభాస్ రోల్ - అండర్ కవర్ పోలీసా?దొంగా?
ఒకే బాటలో రాజశేఖర్, శివాత్మిక
`వెంకీమామ` లుక్స్ అదిరాయిగా...
సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ
గాయనిగా అవతారమెత్తుతున్న పూజా హెగ్డే?
యాక్సిడెంట్ కు గురైన మెగా హీరో
కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న వెంకీమామ
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనిలోభాగంగానే గత కొంతకాలంగా ఈ టీమ్ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక నిన్నటితో కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది చిత్రయూనిట్. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ చాలా వరకూ పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది.
'ఎన్జీకే' క్లోజింగ్ కలెక్షన్స్
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఎన్జీకే’ సినిమా మే31వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాగా.. ఇక్కడ మాత్రం కాస్త నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రన్ టైమ్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఏ యే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు
సినిమా ప్రారంభమైన దగ్గర నుండి రిలీజ్ వరకూ సినిమాల అప్ డేట్ లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు హీరోలు, హీరోయిన్ లు, దర్శక నిర్మాతలు. ఇక తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వచ్చిందంటే చాలు క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్ కూడా. వారి సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తుంటారో వ్యూస్ ను బట్టి చెప్పొచ్చు. అందుకే సినిమా టీజరో, ట్రైలరో రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఒకప్పుడు 1 మిలియన్స్ వస్తే అదో రికార్డ్.. అవన్నీ పోయాయి.. బాహుబలి తో తుడుచుకుపోయి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి రికార్డులు కూడా తుడుచుకుపోయి సరికొత్త…
క్రేజీ ప్రాజెక్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్?
తెలుగు, తమిళ్, హిందీ... ఇలా మూడు భాషల్లోనూ కథానాయికగా రాణిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే `దే దే ప్యార్ దే`, `ఎన్జీకే` చిత్రాలతో పలకరించిన రకుల్... ప్రస్తుతం `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
వరుస సినిమాలతో సందడి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్... ప్రస్తుతం `దర్బార్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు.
అనుష్క 'నిశ్శబ్దం'... 25% షూటింగ్ పూర్తి
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయిక అనుష్క. `అరుంధతి`, `భాగమతి`తో ఘనవిజయాలను అందుకున్న స్వీటీ... ఇప్పుడు మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తోంది. అదే `నిశ్శబ్దం`. బహు భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో `సైలెన్స్` పేరుతో రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం... ఇటీవలే అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. కాగా, అప్పుడే 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఈ విషయాన్ని దర్శకుడు హేమంత్... తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు.

'ఆర్ఆర్ఆర్'... ఓవర్సీస్ బిజినెస్ అదుర్స్
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న మాసివ్ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య... దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

'సాహో'కి సుజీత్ సెంటిమెంట్
2014లో విడుదలైన `రన్ రాజా రన్`తో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు సుజీత్. శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన సదరు స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్... సుజీత్‌కి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. `రన్ రాజా రన్` విడుదలైన ఐదేళ్ళ తరువాత ఇప్పుడు తన రెండో సినిమాతో పలకరించబోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ చిత్రమే `సాహో`. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్... ఆగస్టు 15న విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... సుజీత్ తొలి చిత్రం `రన్ రాజా రన్` కూడా ఆగస్టు నెలలోనే (2014…

డిజిటల్ వ్యూస్ లో 'సాహో' సరికొత్త రికార్డ్
నిన్న సాహో టీజర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. టీజర్ కు వస్తున్న వ్యూస్ చూస్తుంటే.. ఈ టీజర్ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. కేవలం ఒక్క అభిమానులు.. సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం టీజర్ కు సాహో అంటున్నారు. ప్రభాస్ ను.. డైరెక్టర్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ.

గేమ్ ఓవర్ రివ్యూ - వన్ ఉమెన్ షో
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారితో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు చూడదగిన సినిమా అని చెప్పొచ్చు గేమ్ ఓవర్.

స్పైడర్ మాన్ మూవీ తో సాహో
హాలీవుడ్ మూవీస్ కు ఇండియా లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ మొదలయింది. హాలీవుడ్ మూవీస్ తో పాటు తమ మూవీ ట్రైలర్స్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ఏప్రిల్ 26 న ఇండియా లో రిలీజయి కోట్లాది రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఆ మూవీ తో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ భారత్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా
'ఎన్టీఆర్' బయోపిక్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదట బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా.. ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తరువాత 'జైసింహా' సినిమాతో బాలకృష్ణకు హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ సినిమా కూడా లేదన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికి బ్రేక్ పడింది.

స్క్రీన్ ప్లే ఆధారిత యాక్షన్ మూవీ సాహో -ప్రభాస్
సక్సె ఫుల్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ జంటగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో, భారీ తారాగణం తోUV క్రియేషన్స్ , T-సిరీస్ బ్యానర్స్ పై తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 13వ తేదీ రిలీజయిన టీజర్ ఆకట్టుకుని, ప్రేక్షకుల, సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.
సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కథానాయిక. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో మూవీ కి శంకర్, ఎహసాన్,లాయ్ సంగీత దర్శకులుగా సెలెక్ట్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. తాను దర్శకుడిగా పరిచయమయిన రన్ రాజా రన్ మూవీ కి సంగీతం అందించిన జిబ్రాన్ ను దర్శకుడు సుజీత్ సాహో మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి కి ఎంపికచేశారు.

గెస్ ప్రభాస్ రోల్ - అండర్ కవర్ పోలీసా?దొంగా?
ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సాహో హడావుడే నెలకొంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. దీంతో గత మూడురోజుల నుండి టాప్ ట్రెండింగ్ లో ఇదే న్యూస్ ఉంది. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంటో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి.
ఒకే బాటలో రాజశేఖర్, శివాత్మిక
డా.రాజశేఖర్... యాంగ్రీ యంగ్ మాన్‌గా వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం అగ్ర కథానాయకుడు. ఆ మధ్య... దాదాపు పదేళ్ళ పాటు విజయాలకు దూరమైన ఈ సీనియర్ హీరో... రెండేళ్ళ క్రితం విడుదలైన ‘గరుడవేగ’తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. కాగా ప్రస్తుతం రాజశేఖర్ నటించిన తాజా చిత్రం `కల్కి` విడుదలకు సిద్ధమైంది. అంతేకాదు... తన రెండో తనయ శివాత్మిక కథానాయికగా పరిచయమవుతున్న `దొరసాని` కూడా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే... ఇటు `కల్కి`, అటు`దొరసాని` ఇలా రెండు చిత్రాలు కూడా పిరియాడిక్ డ్రామాలే కావడం విశేషం.
`వెంకీమామ` లుక్స్ అదిరాయిగా...
రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య... రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్... కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అటు వెంకీ, ఇటు చైతూ... ఇద్దరూ కూడా సరికొత్త లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. అభిమానులకు…
సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ
వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా UV క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ 2013 సంవత్సరంలో ప్రారంభమయింది. మొదటి ప్రయత్నం గా ప్రభాస్ హీరోగా , కొరటాల శివ ను దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ మిర్చి మూవీ నిర్మించారు. మిర్చి మూవీబాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రన్ రాజా రన్, జిల్, భలే భలే మొగాడివోయ్ (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం ),మహానుభావుడు , భాగమతి, టాక్సీవాలా (గీతా ఆర్ట్స్ 2 భాగస్వామ్యం) మూవీస్ ఘనవిజయం సాధించాయి.
గాయనిగా అవతారమెత్తుతున్న పూజా హెగ్డే?
తెలుగునాట భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కథానాయిక పూజా హెగ్డే. అగ్ర కథానాయకులకి జోడీగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... అతి త్వరలో తన గానామృతంతో అలరించనుందని సమాచారం.
యాక్సిడెంట్ కు గురైన మెగా హీరో
మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి సారిగా వరుణ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు వెళుతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ కు గురైంది.