యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపుతెచ్చుకోవడంతో.. టీజర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. అన్ని భాషలకు చెందిన ఇండస్ట్రీ వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు ఇన్ని రోజులు. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అప్పుడే ప్రభాస్ నెట్టింట రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెట్టేశాడు. టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే వ్యూస్ తో దూసుకుపోతూ ట్రెండింగ్ లో నిలిచింది. అతి తక్కువ టైమ్ లో 100కె లైక్స్ పొందిన టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రిలీజ్ అయిన మూడు గంటలలోపే 1మిలియన్ వ్యూస్ దాటి.. 6 గంటలలో డిజిటల్ వ్యూస్ మొత్తం కలుపుకొని ఇప్పటికే 25మిలియన్స్ కు పైగా వ్యూస్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో… బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రద్దా, ప్రభాస్ మధ్య ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసుకొని ఆగస్ట్ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: