పెళ్లిచూపులు డైరెక్టర్ తో వెంకీ

Venkatesh To Team Up Pellichoopulu Director Tharun Bhascker,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh New Movie With Pellichoopulu Director,Venkatesh to Work With Director Tharun Bhascker,Director Tharun Bhascker Next Film With Venkatesh,Venkatesh Roped For Director Tharun Bhascker
Venkatesh To Team Up Pellichoopulu Director Tharun Bhascker

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద సెక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా పొంగల్ విన్నర్ గా నిలిచి అత్యధిక వసూళ్లను రాబట్టింది. వెంకీ, వరుణ్ తోపాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కు కూడా కెరీర్ బెస్ట్ వసూళ్లను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎఫ్ 2 సినిమా ఇచ్చిన కిక్ తో వెంకీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ బిజీ గా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. గతంలో లాగ కాకుండా.. నచ్చిన కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ డైరీలో డెేట్స్ ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బాబి దర్శకత్వంలో మేనల్లుడు చైతుతో కలిసి వెంకీ మామ సినిమా చేస్తుండగా.. దానితో పాటు మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలతో పాటు వెంకీ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నారట. అంతేకాదు.. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]
[youtube_video videoid=hvS33iNEz5U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =