మన్మథుడు 2 టీజర్ రిలీజ్

#Manmadhudu2Teaser, 2019 Latest Telugu Movie News, Manmadhudu 2 Movie Latest Updates, Manmadhudu 2 Movie Offical Teaser, Manmadhudu 2 Movie Teaser, Manmadhudu 2 Teaser Out, Manmadhudu 2 Telugu Movie Teaser, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే… ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని ప్రముఖ నటి దేవదర్శిని.. నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. వయసైపోతున్నా కూడా కాలేదని ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తూ ఉంటారు. టీజర్‌లో నాగార్జున రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఏజ్‌ బార్‌ అయినా పెళ్లి కానీ వ్యక్తిగా, అమ్మాయిలతో సరదాగా గడిపే ప్లేబాయ్‌గా రెండు షేడ్స్‌లో నాగ్ అలరించనున్నట్టు తెలుస్తోంది టీజర్ ను చూస్తుంటే. ఇక టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెప్పే డైలాగ్‌ టీజర్ కే హైలైట్‌గా నిలిచింది.

కాగా ఈ సినిమాలో నాగార్జునకు తోడుగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=TLWmy4u_qYY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 12 =