బాలీవుడ్ హిట్ థ్రిల్లర్ రీమేక్ లో సునీల్

Sunil To Remake Bollywood Superhit Thriller,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Telugu Actor Sunil Next in Bollywood Remake,Sunil Signs Bollywood Remake Film,Sunil New Movie Adhadhun Remake?,Sunil to Do in Bollywood Film
Sunil To Remake Bollywood Superhit Thriller

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది కాబట్టి ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో అంధుడిగా నటించే ధైర్యం ఎవరు చేస్తున్నారబ్బా అనుకుంటున్నారా..? ఆ అవకాశం సునీల్ కు దక్కినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తన కెరియర్లో ఇదొక చెప్పుకోదగిన సినిమా అవుతుందనే ఉద్దేశంతో సునీల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడట. మరి ఇప్పుడిప్పుడే కమెడియన్ గా మళ్లీ బిజీ అవుతోన్న సునీల్ ఈ సినిమాతో మరోసారి హీరోగా మారుతున్నాడన్నమాట. సునీల్ ఆ పాత్రకు ఎంత వరకు సూట్ అవుతాడో.. ఇక్కడ ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.. చూద్దాం.

ఇదిలా ఉండగా తమిళ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్‌, సిద్ధార్థ్‌ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

[subscribe]

[youtube_video videoid=JIvPgNEjCLc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 12 =