ఫలితాల సంగతి పక్కన పెడితే… ఈ ఏడాది ప్రథమార్ధంలో ఐదు అగ్ర కథానాయకుల చిత్రాలు సందడి చేశాయి. జనవరిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన `యన్టీఆర్ కథానాయకుడు`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `వినయ విధేయ రామ`, విక్టరీ వెంకటేష్ `ఎఫ్ 2` విడుదల కాగా… ఫిబ్రవరిలో బాలయ్య `యన్టీఆర్ మహానాయకుడు` రిలీజైంది. ఇక మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `మహర్షి` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాలన్నీ ఆ యా కథానాయకుల అభిమానులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… ఈ ఏడాది ద్వితీయార్ధంలోనూ మరికొంతమంది అగ్ర కథానాయకులు తమ కొత్త చిత్రాలతో పలకరించనున్నారు. `బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `సాహో` ఆగస్టు 15న విడుదల కానుండగా… అదే నెలలో కింగ్ నాగార్జున కొత్త చిత్రం `మన్మథుడు 2` రిలీజ్ కానుందని సమాచారం. ఇక సెప్టెంబర్‌లో వెంకీ తాజా చిత్రం `వెంకీ మామ` థియేటర్లలోకి రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `సైరా నరసింహారెడ్డి` అక్టోబర్ 2న రానుందని సమాచారం. అదే విధంగా మాస్ మహరాజా రవితేజ నటించిన `డిస్కో రాజా` కూడా అక్టోబర్ నెలలో రాబోతోందని తెలుస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ ఫిల్మ్ కూడా ఏడాది చివరలో రావచ్చంటున్నారు. సో… 2019 ఫస్టాఫ్ కంటే మిన్నగా 2019 సెకండాఫ్ స్టార్ హీరోల చిత్రాలతో కలర్‌ఫుల్‌గా ఉండనుందన్నమాట. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: