గాయ‌నిగా అవ‌తార‌మెత్తుతున్న పూజా హెగ్డే?

Pooja Hegde Turns Singer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Turns Singer From Allu Arjun New Movie,Pooja Hegde To Turn a Singer Soon,Pooja Hegde sing a song For #AA19
Pooja Hegde Turns Singer

తెలుగునాట భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న క‌థానాయిక పూజా హెగ్డే. అగ్ర క‌థానాయ‌కుల‌కి జోడీగా న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… అతి త్వ‌ర‌లో త‌న గానామృతంతో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది పూజ‌. అంతేకాదు… ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడ‌బోతోంద‌ట. త‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందుతున్న ఈ గీతం… సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

ఇదివ‌ర‌కు త్రివిక్ర‌మ్ రూపొందించిన `అర‌వింద స‌మేత‌` కోసం తొలిసారిగా డ‌బ్బింగ్ చెప్పుకున్న పూజ‌… ఇప్పుడు మ‌ళ్ళీ అదే త్రివిక్ర‌మ్ సినిమాతోనే గాయ‌నిగా తొలి అడుగులు వేస్తుండ‌డం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =