హాలీవుడ్ మూవీస్ కు ఇండియా లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ మొదలయింది. హాలీవుడ్ మూవీస్ తో పాటు తమ మూవీ ట్రైలర్స్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ఏప్రిల్ 26 న ఇండియా లో రిలీజయి కోట్లాది రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఆ మూవీ తో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ భారత్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. టీజర్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సాహో మూవీ ట్రైలర్ సోషల్ మీడియా లో జులై 1న రిలీజ్ కానుంది. మార్వెల్ స్టూడియోస్, కొలంబియా పిక్చర్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్స్ పై టామ్ హాలండ్ హీరోగా రూపొందిన స్పైడర్ మాన్ –
ఫార్ ఫ్రమ్ హోమ్ హాలీవుడ్ మూవీ జులై 5వ తేదీ ఇండియాలో 2000స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. ఆ మూవీ తో పాటు సాహో మూవీ ట్రైలర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: