ఒకే బాట‌లో రాజశేఖర్, శివాత్మిక

2019 Latest Telugu Movie News, Rajasekhar and Sivatmika Moving In Same Path, Kalki Release Date, Kalki Movie Updates, 'Dorasani Movie Release date , Sivatmika's debut film Dorasani , Dorasani Movie updaes, Sivatmika Rajasekhar Next Movie Updates, Telugu Film Updates, Tollywood Cinema News
Rajasekhar and Sivatmika Moving In Same Path

డా.రాజశేఖర్… యాంగ్రీ యంగ్ మాన్‌గా వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం అగ్ర క‌థానాయకుడు. ఆ మ‌ధ్య‌… దాదాపు పదేళ్ళ పాటు విజ‌యాల‌కు దూర‌మైన ఈ సీనియ‌ర్ హీరో… రెండేళ్ళ క్రితం విడుద‌లైన ‘గరుడవేగ’తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. కాగా ప్రస్తుతం రాజ‌శేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం `క‌ల్కి` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అంతేకాదు… తన రెండో తనయ శివాత్మిక క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న `దొర‌సాని` కూడా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ‌ విష‌య‌మేమిటంటే… ఇటు `క‌ల్కి`, అటు`దొర‌సాని` ఇలా రెండు చిత్రాలు కూడా పిరియాడిక్ డ్రామాలే కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ‘అ’ లాంటి వైవిధ్యభరితమైన చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ… 80వ దశకంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవ‌ల‌ విడుదలైన టీజ‌ర్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేసింది. పిరియాడిక్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా… ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా… విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజ‌శేఖ‌ర్ రెండో కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా కె.వి.ఆర్.మహేంద్ర రూపొందించిన‌ ‘దొరసాని’ కూడా 80వ దశకంలో సాగే పిరియాడిక్ లవ్ స్టోరీగా తెర‌కెక్కింది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ జూలైలో విడుద‌ల కానుంది.

త‌క్కువ గ్యాప్‌లోనే పిరియాడిక‌ల్ డ్రామాస్‌తో రాబోతున్న‌ ఈ తండ్రీకూతుళ్ళు… ఆ యా చిత్రాలతో ఘ‌న విజ‌యాలు సాధించాల‌ని ఆశిద్దాం.

 

[subscribe]

[youtube_video videoid=OHK3K2hdzjE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =