ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సాహో హడావుడే నెలకొంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. దీంతో గత మూడురోజుల నుండి టాప్ ట్రెండింగ్ లో ఇదే న్యూస్ ఉంది. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంటో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ.. ప్రభాస్ హీరోయిజాన్ని.. ప్రభాస్ చేసిన స్టంట్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేశారు. కార్, బైక్ చేజ్‌లతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారు. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ ఈ సినిమాతో మరో రేంజ్ కు వెళ్తుందేమో అనేలా ఉంది. టీజర్‌లో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరో స్థాయిలో స్టైలిష్ లుక్‌లో ప్రజెంట్ చేశారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఓ దొంగలా కనిపిస్తాడని.. శ్రద్దా కపూర్ పోలీస్ అని వార్తలు వచ్చాయి గతంలో. కానీ టీజర్లో చూస్తే మాత్రం ఇద్దరూ కలిసే కొన్ని సన్నివేశాల్లో పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్ రోల్ ఏంటో టీజర్ లో ఎక్కడా రివీల్ కాలేదు. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఏ రోల్ ప్లే చేస్తున్నాడో గెస్ చేయండి. ఈ కింద ఇచ్చిన రెండు ఆప్షన్ లలో ప్రభాస్ ది ఏ రోల్ అనుకుంటున్నారో ఓటు వేసి గెస్ చేయండి..
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: