నిన్న సాహో టీజర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. టీజర్ కు వస్తున్న వ్యూస్ చూస్తుంటే.. ఈ టీజర్ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. కేవలం ఒక్క అభిమానులు.. సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం టీజర్ కు సాహో అంటున్నారు. ప్రభాస్ ను.. డైరెక్టర్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కుడ చూసినా సాహో హవానే నడుస్తోంది. టీజర్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కేవలం 6 గంటల్లోనే 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది . ఇప్పుడు తాజాగా యూవీ క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా మరో విషయాన్ని పంచుకుంది. సాహో టీజర్ ను ఎవరూ ఆపలేరని.. నాలుగు భాషల్లో కలిపి 60 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతుందని తెలిపారు.
Unstoppable #SaahoTeaser hits whopping 60 Million + digital views across all four languages in 24 hours🔥
Experience the action here: https://t.co/JlDpuvYIZj #Prabhas @ShraddhaKapoor @NeilNMukesh @sujeethsign @itsBhushanKumar @UV_Creations @TSeries #Saaho pic.twitter.com/F8KXsmer5J— UV Creations (@UV_Creations) June 14, 2019
కాగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . మరి టీజర్ తోనే ఇంత ప్రభంజనం సృష్టించిన ప్రభాస్ ట్రైలర్ తో బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక సినిమా అయితే ఓపెనింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: