ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 21

'రణరంగం' సర్ ప్రైజింగ్ అప్ డేట్

ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

‘సైరా’... డబ్బింగ్ పూర్తి చేసిన చిరు

డబ్బింగ్ లో చిరంజీవి రికార్డ్

నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్
కల్కీ రన్ టైమ్ లాక్
డిటెక్టివ్ పాత్రలలో టాలీవుడ్ హీరోలు

#NC20 మూవీ ప్రారంభం

కె. బాలచందర్ ‘ఇది కథ కాదు’కు 40 ఏళ్ళు
వాయిదా పడ్డ ‘బుర్రకథ’

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం రెండు తేదీలు
చిరు-కొరటాల కాంబినేషన్ మూవీ అప్‌డేట్

రాజశేఖర్, ఆది... సేమ్ టు సేమ్
మరోసారి డబ్బింగ్ చెప్పిన నివేదా థామస్
మలయాళ ముద్దుగుమ్మతో కార్తికేయ
ఇటీవలే హిప్పీ సినిమాతో కాస్త నిరాశ పరిచిన కార్తికేయ ఇప్పుడు గుణ 369 సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా... ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమాలో కూడా కార్తికేయకు జోడీగా ఓ మలయాళ ముద్దుగుమ్మనే నటిస్తుంది. అనఘ అనే మలయాళ బ్యూటీ కార్తికేయకు పక్కన నటిస్తోంది.

బూతు తిట్లతో ఏడిపించి.. పూరి పొటాటోతో బుజ్జగించి...
విజయనిర్మల.... పేరులోని విజయాన్ని జీవితారంభం నుండి జీవితాంతం వరకు కొనసాగించిన అత్యంత విజయవంతమైన మహిళా రత్నం విజయనిర్మల. అలాగే పేరులోని నిర్మలత్వాన్ని , నిష్కల్మష ప్రేమను కూడా అందరికీ పంచిన ప్రేమమూర్తి ఆమె. సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో ఆమె సాధించిన విజయాలు, ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆమె నెలకొల్పిన రికార్డులు, ఆమె కురిపించిన ప్రేమాభిమానాలు , ఆమె చేసిన దాన ధర్మాలు ఆమెను ఒక విశిష్ట మహిళగా నిలబెట్టాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఆమె వజ్ర సంకల్పమే ఆమెను "ఉక్కు మహిళ" గా ఆవిష్కరించింది. సమర్థత, పట్టుదల, మొండితనం వంటి లక్షణాలతో గొప్పవాళ్లుగా ఎదగవచ్చునేమో కానీ మంచివాళ్లుగా నిలవలేరు…

1368 అడుగుల ఎత్తులో "సాహో" సాంగ్
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అండ్ బడ్జెట్ సినిమా సాహో. ప్రస్తుతం మూవీ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియా లో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే పాట షూట్ కూడా ఏదో నార్మల్ గా కాకుండా 1368 అడుగుల ఎత్తులో షూట్ చేస్తున్నారట. దీనికోసం కేబుల్ కార్స్ తీసుకెళ్లడం జరిగిందట. అయితే అంత ఎత్తులో షూట్ జరుగుతున్నప్పుడు యూనిట్ అంతా కంగారుపడకుండా హీరో ప్రభాస్ అందర్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారట.

'రణరంగం' సర్ ప్రైజింగ్ అప్ డేట్
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రణరంగం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమవడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో శర్వానంద్ దాదాపు రెండు నెలల వరకూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమైంది చిత్రయూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా టీజర్ రిలీజ్ డేట్ నుతెలిపారు. రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఓ బేబీ కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ మూవీ. ఓ బేబీ మూవీ ప్రమోషన్స్ లో సమంత బిజీగా ఉన్నారు.

‘సైరా’... డబ్బింగ్ పూర్తి చేసిన చిరు
బ్రిటీష్ వారిని, వారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే.

డబ్బింగ్ లో చిరంజీవి రికార్డ్
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి బయోపిక్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతుంది. నయనతార, తమన్నా కథానాయికలు కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సైరా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 10 రోజుల క్రితం చిరంజీవి తన పాత్ర కు శబ్దాలయా స్టూడియో లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. సైరా మూవీ లోని తన క్యారెక్టర్ కున్న భారీ డైలాగ్…

నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్
ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు లాంగ్వెజస్ లో రూపొందుతున్న ఈసినిమా ఇతర భాషల్లో 'సైలెన్స్' పేరుతో రిలీజ్ కానుంది. అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
కల్కీ రన్ టైమ్ లాక్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాగా ఈసినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. మరి ఒక థ్రిల్లర్ మూవీకి ఇంత టైమ్ అంటే గొప్ప విషయమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
డిటెక్టివ్ పాత్రలలో టాలీవుడ్ హీరోలు
హాలీవుడ్ లో రూపొందే జేమ్స్ బాండ్ మూవీస్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ ఉంది. బెంగాలీ సాహిత్యం లో డిటెక్టివ్ సాహిత్యం ఒక వెలుగు వెలిగింది. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధు బాబు ల తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కుర్రకారును ఒక ఊపు ఊపింది. డిటెక్టివ్ నవలలోని డిటెక్టివ్ వాలి, యుగంధర్, షాడో , బుల్లెట్ పాత్రలు ప్రేక్షకాదరణ పొందాయి. బెంగాలీ డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితుడైన నిర్మాత చక్రపాణి మిస్సమ్మ మూవీ లో ANR ను లోకల్ డిటెక్టివ్ పాత్రలో నటింపజేశారు.

#NC20 మూవీ ప్రారంభం
బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తరువాత నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ హిట్ మజిలీ మూవీ తో మంచి ఫామ్ లో ఉన్న హీరో నాగచైతన్య, ఫిదా మూవీ తో ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ రూపొందనుంది. అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు. రాందాస్ నారంగ్, FDC ఛైర్మన్ రామ్మోహనరావు, అమిగో క్రియేషన్స్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
ఈ ఏడాదిలోనూ టాలీవుడ్ జూలై సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?
గత ఐదేళ్లుగా టాలీవుడ్‌కు జూలై నెల బాగా కలిసొస్తోంది. ముఖ్యంగా... 2014 నుంచి ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలు అనూహ్య విజయాలను సాధిస్తూ... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ళలో టాలీవుడ్ జూలై ట్రాక్ రికార్డ్‌ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’తో మొదలైన ఈ `జూలై` విజయపరంపర... 2015లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బెగినింగ్’తో మరో స్థాయికి వెళ్ళింది. అనంతరం 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’, 2017లో విడుదలైన ‘ఫిదా’, 2018లో వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ ఘనవిజయాలు సాధించడంతో టాలీవుడ్‌లో జూలై…
బన్నీ-త్రివిక్రమ్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
`నా పేరు సూర్య` తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కె. బాలచందర్ ‘ఇది కథ కాదు’కు 40 ఏళ్ళు
మధ్యతరగతి కుటుంబాల వారి మనస్తత్వాలను ఆవిష్కరించడంలో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ శైలే వేరు. మనింటి కథనో లేదంటే పక్కింటి కథనో వెండితెరపై వీక్షిస్తున్న అనుభూతిని కలిగించే కథనాలు, పాత్రల స్వభావాలు ఆయన సినిమాల్లో కనిపిస్తుంటాయి. అలా ఈ దర్శకదిగ్గజం రూపొందించిన అపూర్వ చిత్రాల్లో ‘ఇది కథ కాదు’ ఒకటి. జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరంజీవి, కమల్ హాసన్, శరత్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ళలో వచ్చిన ఈ చిత్రం... నటుడిగా చిరు స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో చిరు అభినయం రమణీయం, చిరస్మరణీయం.
వాయిదా పడ్డ ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బుర్రకథ’. మిస్టీ చక్రవర్తి, నైరాషా కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. రెండు మెదళ్ళు ఉన్న ఓ యువకుడి చుట్టూ తిరిగే కథాంశంతో `బుర్రకథ` తెరకెక్కింది. అభిమన్యు సింగ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం రెండు తేదీలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ది లయన్ కింగ్’ ఇండియన్ వెర్షన్స్‌కి ప్రముఖుల డబ్బింగ్
భావోద్వేగాలకు భాష అవసరం లేదు... మనసును తాకితే చాలు... ఆ సినిమాకి విజయం తథ్యం అని నిరూపించిన చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ ఒకటి. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్ ఎపిక్ మ్యూజికల్ యానిమేటెడ్ మూవీని ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మించింది ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్. చారిత్రక విజయం సాధించిన ఈ చిత్రాన్ని... మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళ తరువాత ‘ది జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరేవ్... ఇప్పటి తరం ప్రేక్షకుల కోసం ఫోటో రియలస్టిక్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ టెక్నాలజీతో 3D వెర్షన్‌లో తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 19న విడుదల కానుంది. కాగా…
చిరు-కొరటాల కాంబినేషన్ మూవీ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... ఈ నెల 24తో షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోయే తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు చిరు. ఇప్పటికే చిరు కోసం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో పాటు డైలాగ్ వెర్షన్‌తో సహా సిద్ధం చేసాడట కొరటాల. చిరు డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వనున్న ఈ చిత్రంలో... ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ…

రాజశేఖర్, ఆది... సేమ్ టు సేమ్
కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా భలే గమ్మత్తుగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన విషయమే... సీనియర్ హీరో రాజశేఖర్, యంగ్ హీరో ఆది విషయంలో రెండేళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే... 2017 నవంబర్ 3న సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18M’ చిత్రం విడుదలైంది. అదే రోజున యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాల తరువాత ఈ ఇద్దరు హీరోల నుంచి 2018లో ఒక్క సినిమా కూడా తెరపైకి రాలేదు. కట్ చేస్తే... 2019లో మళ్ళీ ఒకే రోజున ఈ ఇద్దరు హీరోలు తమ…
మరోసారి డబ్బింగ్ చెప్పిన నివేదా థామస్
`జెంటిల్‌మన్` (2016)తో టాలీవుడ్‌కి కథానాయికగా పరిచయమైంది నివేదా థామస్. ఆ చిత్రంతో మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ చిత్రాలతోనూ అలరించింది నివేదా. ఇక ఇటీవల విడుదలైన ‘118’తో మరో విజయాన్ని అందుకున్న ఈ భామ... ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే... నివేదా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు సిద్ధమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్‌గా ఎదగాలనుకునే పాత్రలో నటించింది నివేదా. అంతేకాదు, ఈ చిత్రం కోసం తన…