కె. బాల‌చందర్ ‘ఇది కథ కాదు’కు 40 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, 40 Years For Idi Katha Kaadu Movie, 40 Years For Idi Katha Kaadu Telugu Movie, Idi Katha Kaadu Movie Completed 40 Years, Idi Katha Kaadu Movie, Idi Katha Kaadu Telugu full Movie , Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, 0 Years For K Balachander Idi Katha Kaadu
40 Years For K Balachander Idi Katha Kaadu
మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వారి మ‌న‌స్త‌త్వాల‌ను ఆవిష్క‌రించ‌డంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ శైలే వేరు. మ‌నింటి క‌థ‌నో లేదంటే ప‌క్కింటి క‌థ‌నో వెండితెర‌పై వీక్షిస్తున్న అనుభూతిని క‌లిగించే క‌థ‌నాలు, పాత్ర‌ల స్వ‌భావాలు ఆయ‌న సినిమాల్లో క‌నిపిస్తుంటాయి. అలా ఈ దర్శ‌క‌దిగ్గ‌జం రూపొందించిన అపూర్వ చిత్రాల్లో ‘ఇది కథ కాదు’ ఒకటి. జ‌య‌సుధ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో చిరంజీవి, కమల్ హాసన్, శరత్ బాబు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ళ‌లో వ‌చ్చిన ఈ చిత్రం… న‌టుడిగా చిరు స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో చిరు అభిన‌యం ర‌మ‌ణీయం, చిర‌స్మ‌ర‌ణీయం. ఇక బాలచందర్ సినిమాలలో కథ, కథనాలు, పాత్రలే కాదు… పాటలకి కూడా సముచిత స్థానం ఉంటుంది. ఆయన సినిమాల్లో వచ్చే పాటలన్నీ సందర్భోచితంగానూ… పాత్రలనో, పాత్రల స్వభావాలనో తెలియ‌జేసే విధంగానూ ఉంటాయి. `ఇది క‌థ కాదు`లోనూ అదే శైలి క‌నిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలకు మనసు కవి ఆచార్య ఆత్రేయ గీత రచన చేస్తే… బాలచందర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ స్వ‌రక‌ల్ప‌న చేసారు. వాటిలో ముఖ్యంగా “జూనియర్ జూనియ‌ర్‌”, “గాలికదుపు లేదు”, “సరిగమలు గలగలలు” వంటి పాటలు పాత్రల స్వభావాలను చెబితే… “తకధిమి తక” పాట మాత్రం సినిమా కథను ప్ర‌తిబింబించేలా ఉంటుంది. భారత్ ఫిలిమ్స్ పతాకంపై టి.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా 1979 జూన్ 27న విడుదలై విశేషాదరణ పొందింది. ‘ఇది కథ కాదు’… జీవితం అన్న‌ట్టుగా తెర‌కెక్కిన ఈ చిత్రం… నేటితో 40 వసంతాలను కూడా పూర్తి చేసుకుంటోంది. ‘ఇది కథ కాదు’ – కొన్ని విశేషాలు: * చిరు, బాలచందర్ కలయికలో వచ్చిన తొలి చిత్ర‌మిది. ఆ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `47 రోజులు`, `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`, `రుద్ర‌వీణ‌` చిత్రాలు రూపొందాయి. * కమల్, చిరు కలసి న‌టించిన‌ ఏకైక చిత్రం ‘ఇది కథ కాదు’. * 1977లో తమిళంలో వచ్చిన ‘అవర్ గ‌ళ్‌’ (సుజాత ప్ర‌ధాన పాత్ర‌ధారిణి) సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అందులో రజినీకాంత్ విలన్‌గా నటించగా, తెలుగులో ఆ క్యారెక్టర్‌లో చిరు కనిపించడం విశేషం. అలాగే… మాతృకలో పోషించిన పాత్రనే, తెలుగులోనూ పోషించి అల‌రించారు క‌మ‌ల్‌.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=5hPUus821rE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 11 =