నేను బాగానే ఉన్నాను – రూమర్లకు అనుష్క చెక్

Anushka Shetty Clears The Rumours

ప్రస్తుతం అనుష్క హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు లాంగ్వెజస్ లో రూపొందుతున్న ఈసినిమా ఇతర భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రిలీజ్ కానుంది. అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాతో పాటు అనుష్క సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈసినిమా చిత్రీకరణలో భాగంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. అనుష్క కాలికి గాయమైందని.. కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని అనుష్కకు సూచించినట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలపై స్పందించిన అనుష్క క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. సియాటిల్‌లో సంతోషంగా చిత్రీకరణలో పాల్గొంటున్నాను. లవ్యూ ఆల్‌’ అని స్పష్టం చేసింది. మరి దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

😘😘

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

[subscribe]

[youtube_video videoid=lP38wLexid8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.