ఈ ఏడాదిలోనూ టాలీవుడ్‌ జూలై సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?

2019 Latest Telugu Movie News, Will The Same Sentiment Continue For Tollywood In July, july Sentiment for Tollywood heros, telugu upcomig movies in july 2019,july Sentiment Continue For Tollywood movies , Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Will The Same Sentiment Continue For Tollywood In July?

గత ఐదేళ్లుగా టాలీవుడ్‌కు జూలై నెల బాగా కలిసొస్తోంది. ముఖ్యంగా… 2014 నుంచి ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలు అనూహ్య‌ విజయాలను సాధిస్తూ… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ‌డ‌చిన ఐదేళ్ళ‌లో టాలీవుడ్ జూలై ట్రాక్ రికార్డ్‌ను ఒక‌సారి పరిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. 2014లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’తో మొద‌లైన ఈ `జూలై` విజ‌యప‌రంప‌ర… 2015లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బెగినింగ్’తో మ‌రో స్థాయికి వెళ్ళింది. అనంత‌రం 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’, 2017లో విడుదలైన ‘ఫిదా’, 2018లో వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ ఘ‌న‌విజ‌యాలు సాధించ‌డంతో టాలీవుడ్‌లో జూలై సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో… ఈ ఏడాది జూలై నెల‌లో విడుద‌ల‌య్యే సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ సంవ‌త్సరం కూడా జూలై నెల‌లో ‘ఓ బేబీ’, ‘రాజ్‌దూత్’(జూలై 5 విడుద‌ల‌), ‘దొరసాని’, ‘నిను వీడని నీడను నేనే’(జూలై 12), ‘రాక్షసుడు’, ‘ఇస్మార్ట్ శంకర్’(జూలై 18), ‘డియర్ కామ్రేడ్’(జూలై 26) వంటి క్రేజీ మూవీస్ విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రి… వీటిలో జూలై సెంటిమెంట్‌ని కొన‌సాగించే చిత్రం ఏది అవుతుందో తెలియాలంటే మ‌రికొన్నాళ్ళు ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=750rHEFMc9M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 9 =