కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 19

2019 Latest Telugu Movie News, Oh Baby Gets Censored Certified, Oh Baby Movie Censor Report, Oh Baby Movie Censor Talk, Oh Baby Movie Completes Censor Formalities, Oh Baby Movie Gets Censor Board Approval, Oh Baby Movie Latest Updates, Telugu Film Up
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Naga Shourya Latest MOvie News, Naga Shourya Back To Shooting After Leg Injury, Naga Shourya Back to Shooting Severe Injury, Naga Shourya Recoverd From leg Injury, Naga Shourya Shooting Details, Naga Shourya Upcom
షూటింగ్ అప్‌డేట్

కోలుకున్న నాగశౌర్య.. బ్యాక్ టు షూట్

రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నాగశౌర్య గాయపడిన సంగతి కూడా విదితమే. స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి ఆధారం లేకుండా, డూప్ సహాయం తీసుకోకుండా 15అడుగుల ఎతైన భవనం పై నుండి దూకడంతో ఆయన మోకాలికి బలమైన గాయమైంది. దీంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు

జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాలు తీసే పద్దతి కూడా మారుకుంటూ వచ్చింది. పాతకాలం సినిమాలను.. ఇప్పటి సినిమాలను పోల్చి చూస్తే ఎంతో తేడా ఉంటుంది. అప్పటి సినిమాల్లో కుటుంబ విలువలు, బంధాలు-బాంధవ్యాలు, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఇలా అనేక అంశాలు ఉండేవి. అప్పట్లో సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నాంబ, సావిత్రి, సూర్యకాంతం, జమున, వాణిశ్రీ ఇలా మహానాయికలతో నటించాలంటే అప్పటి హీరోలు సైతం భయపడే వాళ్లు. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని మరీ సినిమాలు రాసేవాళ్లు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కుటుంబ‌క‌థా చిత్రం "జరిగిన కథ" కు 50 ఏళ్ళు

“అనుమానం పెనుభూతం” అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జరిగిన కథ’. అన్నదమ్ముల ఆదర్శం, ఆలుమగల అనురాగం, తల్లీబిడ్డల మమకారం వంటి అంశాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సినిమా. “కళావాచస్పతి” జగ్గయ్య, సూపర్ స్టార్ కృష్ణ, కాంచన ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాగయ్య, రాజనాల, రాజబాబు, బాలకృష్ణ, అల్లురామలింగయ్య, ప్రభాకరరెడ్డి, సంధ్య, విజయలలిత, మంజుల, సబిత, బేబీ రోజారమణి తదితరులు ఇతర భూమికలను పోషించారు. కె.బాబూరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగావళీ (విజేతా) ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.ప్రభాకర్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో సామ్‌?

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న‌ సమంత... గత రెండేళ్లుగా నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది. ఈ నేపథ్యంలో గ‌తంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌గా విడుద‌లైన ‘యూటర్న్’, ‘రాజుగారి గది 2’ చిత్రాలలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... రేపు (జూలై 5న) విడుదల కానున్న ‘ఓ బేబీ’లో మ‌రోసారి అటువంటి పాత్ర‌లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు తమిళంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ చేయబోతోందట సామ్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Tollywood Ace Producer Dil Raju Enters into Bollywood, Producer Dil Raju Latest News, Producer Dil Raju heads to Bollywood, Dil Raju Produce In Bollywood, Dil Raju To Enter Bollywood, Dil Raju Upcoming Movies News, Late
సినిమా వార్తలు

మూడు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో బాలీవుడ్‌లోకి దిల్ రాజు?

‘దిల్’ రాజు... తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత. నిర్మాతగా గత 16 ఏళ్ళుగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్... ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజు. అంతేకాదు... ఈ మూడూ కూడా తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mahesh Babu Movie Sarileru Neekevvaru Movie Starts from Tomorrow, Sarileru Neekevvaru Mahesh Babu 26th Film Shooting, Sarileru Neekevvaru Movie Shooting Updates, Sarileru Neekevvaru Movie Latest News, Mahesh Babu New Mov
షూటింగ్ అప్‌డేట్

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
‘మిస్టర్ kk’ ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

‘మిస్టర్ kk’ ట్రైలర్ రిలీజ్

చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఎప్పుడో ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఫైనల్లీ ఈరోజు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Huge Cut out at RTC X Roads For Samantha, Samantha Fans Arranged Huge Cut Out At Cross Roads, Actress Samantha Cut Out for Oh Baby Movie, Oh Baby Movie Latest News, Samantha Upcoming movie Updates, Fans build a huge roy
సినిమా వార్తలు

సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్

ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా... సమంత ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం ఆమె ఎంచుకునే కథలు కూడా కారణమే అని చెప్పొచ్చు. అందుకే దాదాపు ఎక్కువ హిట్ సినిమాలనే తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్ దక్కుతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, S V Ranga Rao A Lodestar In The Telugu Film Firmament, S V Ranga Rao Birth Anniversary Special, Tollywood legend Actor S V Ranga Rao Birth Anniversary, Remembering Legendary Actor SV Ranga Rao on his Birth Anniversary,
స్పెషల్

దుష్ట - శిష్ఠ- విశిష్ట పాత్రలెన్నింటినో పాదాక్రాంతం చేసుకున్న అభినయ ఘనాపాటి ఎస్వీ రంగారావు

కొందరు వ్యక్తుల గురించి, వారు సాధించిన విజయాల గురించి , వారు నెలకొల్పిన ప్రమాణాల గురించి ఎన్ని సార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలా ఎంత చెప్పినా... ఎన్నిసార్లు చెప్పినా తనివితీరని గొప్ప విశేషాల సమాహారమే నట సార్వభౌమ ఎస్వీ రంగారావు జీవిత చరిత్ర.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Saaho First Song Teaser Out, saaho first single teaser out soon , Saaho lyrical song, Saaho official Song teaser released, Saaho movie songs, Saaho movie Latest Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywoo
ట్రైలర్ & టీజర్

సాహో నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ టీజర్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంగిపు దశకు వచ్చేయడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇక ఈసినిమా అప్ డేట్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేందుకు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా.. అది ఎన్నిసంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. 'ద సైకో సయ్యాన్' అనే పాట టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Gopichand upcoming movie updates, Gopichand chanikya movie shooting updates, chanikya movie shooting details, Director Thiru chanakya movie details, Chanakya Movie Shooting in Hyderabad,Gopichand Chanakya Movie Schedule
సినిమా వార్తలు

హైదరాబాద్ లో గోపిచంద్ 'చాణక్య'

తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గతంలో ఇండో పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో శరవేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Vijaya Nirmala movies, Actress Vijaya Nirmala professional life story, Telugu Film Udates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijaya Nirmala Biography Part 3, Vijaya Nirmala life story, Vijaya Nirmala real
ఇంటర్వ్యూ

గొడవలేమీ జరగలేదు గానీ .. మా పెళ్లి ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.. శ్రీమతి విజయ నిర్మల

* అప్పట్లో మీ పెళ్లి చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది కదా... మీ కుటుంబాలలో ఏవైనా అభ్యంతరాలు ఎదురయ్యాయా..? గొడవలు జరిగాయా ?

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినిమా తీయకపోతే మూసేసినట్టేనా..!

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తమిళ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ధనుష్. మామకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నా.. అవన్నీ తట్టుకొని తన నటనతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు.. తెలుగు లో కూడా ధనుష్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తను ద ఎక్స్ ట్రార్డీనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఇండో ఫ్రెంచ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాత్ర కోసం వినాయక్ కష్టాలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ మూవీలు అందించిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుబోతున్న ఈసినిమాకు గతంలో శరభ అనే సినిమాను తీసిన దర్శకుడు నరసింహారావు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nagarjuna Manmadhudu 2 Movie Character Revealed, Shades of Nagarjuna in Manmadhudu 2, Nagarjuna Character in Manmadhudu 2 movie, Manmadhudu 2 Movie Latest Updates, Nagarjuna Role From Manmadhudu 2, Nagarjuna Role Reveal
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`లో నాగ్ పాత్ర అదేనా?

`మ‌న్మ‌థుడు`కి 2.0 వెర్ష‌న్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ నాయిక‌గా న‌టిస్తోంది. స‌మంత‌, కీర్తి సురేష్ అతిథి పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. `చి.ల‌.సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నాగార్జున‌, పి.కిర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో నాగార్జున పాత్ర‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... `మ‌న్మ‌థుడు`లో యాడ్ కంపెనీ ఓన‌ర్‌గా క‌నిపించిన నాగ్‌... `మ‌న్మ‌థుడు 2`లో పెర్వ్యూమ్ కంపెనీ ఓన‌ర్‌గా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Director Sandeep Reddy Vanga Latest News, telugu directors shocking offers to work with bollywood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Directors Hungama in Bollywood, Tollywood direct
సినిమా వార్తలు

బాలీవుడ్‌లో నెల‌కో తెలుగు ద‌ర్శ‌కుడి ఎంట్రీ

హిందీనాట‌ ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు త‌మదైన ముద్ర‌వేశారు. అయితే, వ‌రుస నెల‌ల్లో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం అరుదైన విష‌య‌మ‌నే చెప్పాలి. ఈ ఏడాది అలాంటి అరుదైన సంఘ‌ట‌నే హిందీనాట చోటుచేసుకుంటోంది. జూన్‌, జులై, ఆగ‌స్టు... ఇలా ఈ మూడు నెల‌ల్లో మ‌న ద‌ర్శ‌కులు వ‌రుస‌పెట్టి అక్క‌డ రంగ‌ప్ర‌వేశం చేస్తున్నారు. ఆ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు... సందీప్ రెడ్డి వంగా, ప్ర‌కాష్ కోవెల‌మూడి, సుజీత్‌. ఇప్ప‌టికే జూన్ 21న విడుద‌లైన `అర్జున్ రెడ్డి` రీమేక్ `క‌బీర్ సింగ్‌`(షాహిద్ క‌పూర్‌, కియారా అద్వాని హీరోహీరోయిన్లు) తో సందీప్ బాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఇంప్రెష‌న్ వేస్తే... జులై 26న‌ `జ‌డ్జ్‌మెంట‌ల్ హై…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Prabhas and Venkatesh Movies to have Same Plot, Prabhas and Venkatesh Movies to have similar sotry, Prabhas upcoming saaho movie updates, Venky Mama movie latest news, Venkatesh Venky Mama movie, Telugu Film Updates, Te
సినిమా వార్తలు

ఒకే బాట‌లో వెంకీ, ప్ర‌భాస్ చిత్రాలు

ఒకే త‌ర‌హా పాయింట్‌తో ఒకే స‌మ‌యంలో రెండు చిత్రాలు తెర‌కెక్కుతుండ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే వైనం రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల విష‌యంలో జ‌రుగుతోంద‌ని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `వెంకీమామ‌` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా... మామ‌కి అల్లుడి వ‌ల్ల గండం ఉండ‌డం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట‌. జ్యోతిష్యం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి ఈ పాయింట్‌నే కీల‌క‌మైన అంశ‌మ‌ని స‌మాచారం. అయితే, ఈ వ్య‌వ‌హార‌మంతా ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని టాక్‌. ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విష‌యానికి…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, VFX Supervisor Srinivas Mohan is Now Member of Oscar Panel, VFX Supervisor Srinivas Mohan, Srinivas Mohan Member of Oscar Panel, Oscar Panel members, VFX Supervisor now in Oscar Panel member, telugu film updates, Telugu
సినిమా వార్తలు

శ్రీనివాస్ మోహన్ కు అరుదైన ఘనత - ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ లో సభ్యత్వం

ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనుక డైరెక్టర్, హీరో హీరోయిన్ల కష్టం ఎంత ఉంటుందో.. సాంకేతిక నిపుణుల కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. సినిమాకు డైరెక్షన్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా అన్నీ 24 ఫ్రేమ్ లు సమపాళ్లలో కుదిరితేనే ఒక సినిమా రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా.. అసలు మ్యాటరేంటంటే.. దర్శకుల కోరుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అందించగలిగే కొద్ది మందిలో శ్రీనివాస్ మోహన్ ఒకరు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Natural Star Nani Gang Leader Movie Latest Updates, Gang Leader movie new schedule updates, Gang Leader movie latest news, Nani Gang Leader movie news, Natural Star Nani latest movie news, Actor nani upcoming movie updat
షూటింగ్ అప్‌డేట్

గ్యాంగ్ లీడ‌ర్‌` న‌యా షెడ్యూల్ అప్‌డేట్‌

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 24వ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. `24` ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహ‌న్ నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న `గ్యాంగ్ లీడ‌ర్‌`కి సంబంధించి తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఈ నెల 20 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీతో పాటు ఓ పోరాట ఘ‌ట్టాన్ని కూడా…

Team TFNవాట్సాప్

షేర్