సినిమా తీయకపోతే మూసేసినట్టేనా..!

2019 Latest Telugu Movie News, Dhanush Opens Up about Wunderbar Films Production House, Dhanush gives Clarity on Production House Rumors, Clarification on Production house by Dhanush, Wunderbar Studios Latest movie News, Wunderbar Studios Updates, Actor Dhanush Upcoming Movie News, Actor Dhanush production house updates,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Dhanush Opens Up about Wunderbar Films Production House

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తమిళ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ధనుష్. మామకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నా.. అవన్నీ తట్టుకొని తన నటనతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు.. తెలుగు లో కూడా ధనుష్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తను ద ఎక్స్ ట్రార్డీనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఇండో ఫ్రెంచ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన నిర్మాణ సంస్థ మూతపడినట్టు వస్తున్న వార్తలపై స్పందించి.. క్లారిటీ ఇచ్చాడు. ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ లో గత ఏడాది కాలా సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ సంస్థ మూత పడిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ధనుష్ స్పందించి.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని… స్క్రిప్ట్స్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు… అంతేకానీ… సినిమాలు తీయనంత మాత్రానా మూతపడినట్టేనా… నిర్మాతలకు హిట్స్ వస్తుంటాయి.. ఫ్లాప్స్ వస్తుంటాయి… మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టిన సినిమాలు ఉన్నాయి… అన్నీ కుదిరాక త్వరలో తదుపరి సినిమాను ప్రకటిస్తామని రూమర్లకు కౌంటర్ ఇచ్చాడు. మంచి స్క్రిప్ట్‌ లభిస్తే రజనీ సర్‌ తో మళ్లీ సినిమా తీస్తా అని పేర్కొన్నాడు. మరి ఈ క్లారిటీ తో గాసిప్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=TDkeOOOMmao]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here