
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 18


రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?

గాంధీ జయంతికి అమితాబ్ బచ్చన్ డబుల్ ధమాకా?

`గీత గోవిందం` తరువాత మరోసారి...?

`పింక్` తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ?

బ్రోచేవారెవరురా పై బన్నీ ప్రశంసలు

తెలుగులోకి టెంపర్ రీమేక్ అయోగ్య అవసరమా..!

ప్రభాస్ ను రికమెండ్ చేసిన యష్..!

విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
అన్నాదమ్ముళ్లు ఎనిమిదేళ్ల తరువాత
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు

రామ్ జోడీగా నివేదా?

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్?
ప్రియాంక అరుళ్ మోహన్... ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే... ఈ అమ్మడి తొలి తెలుగు చిత్రం సెట్స్ పై ఉండగానే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పాలి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ ‘మిస్టర్. K K’
విలక్షణ నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కడారం కొండాన్’. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ‘మిస్టర్. K K’ పేరుతో ఇటీవలే కిల్లర్ లాంటి సూపర్‌హిట్ చిత్రంతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణ లో విడుదల చేయనున్నారు. కమల్‌తో ‘తూంగావనం’ (తెలుగులో ‘చీకటిరాజ్యం’)వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్ ఎం.సెల్వ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. కమల్ రెండో తనయ అక్షర హాసన్ కీలక పాత్ర…

రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?
‘నేను శైలజ’ చిత్రంలోని “నైట్ ఈజ్ స్టిల్ యంగ్” పాటతో నర్తకిగా వెండితెరకు పరిచయమైన భామ తాన్యా హోప్. అనంతరం ‘అప్పట్లో ఒకడున్నాడు’, ‘పటేల్ సర్’, ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటిగానూ ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈమె నటించిన కన్నడ చిత్రం ‘హోమ్ మినిస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా... మరో కన్నడ మూవీ ‘ఖాకి’ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

గాంధీ జయంతికి అమితాబ్ బచ్చన్ డబుల్ ధమాకా?
అమితాబ్ బచ్చన్... భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఒక బ్రాండ్. ఐదు దశాబ్దాల అభినయ పర్వంలో పలు విభిన్న భూమికలను పోషించి... భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారాయన. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా... ఎన్నో విలక్షణ పాత్రల్లో కనిపించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు బిగ్ బి.

`గీత గోవిందం` తరువాత మరోసారి...?
`గీత గోవిందం`... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం. అలాంటి ఈ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నతో... ప్రస్తుతం `డియర్ కామ్రేడ్` చేస్తున్నాడు విజయ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్... ఈ నెల 26న విడుదల కానుంది. కాగా,`గీత గోవిందం` నాయికతో మరోసారి కలసి పనిచేసిన విజయ్... ఆ చిత్ర దర్శకుడు పరశురామ్‌తోనూ మరో చిత్రం చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఇప్పటికే విజయ్, పరశురామ్ మధ్య చర్చలు జరిగాయని... అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలోగానీ లేదంటే వచ్చే సంవత్సరం…

`పింక్` తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ?
`మంగమ్మగారి మనవడు`, `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహా`... ఇలా రీమేక్స్ లోనూ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నటసింహ నందమూరి బాలకృష్ణది. ఇంకా చెప్పాలంటే... ఒరిజినల్ వెర్షన్స్ కంటే మిన్నగా రీమేక్స్ హిట్ అయిన సందర్భాలు బాలయ్యకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో మరో రీమేక్‌లో నటించబోతున్నారంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

బ్రోచేవారెవరురా పై బన్నీ ప్రశంసలు
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా ఈనెల 28వ తేదీన రిలీజై మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మరోసారి శ్రీ విష్ణు, నివేదా థామస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని ఈ సినిమాతో రుజువైంది.

హద్దులు దాటిన అశ్లీలతను ఎవరు ప్రదర్శించినా తప్పే
* దర్శకురాలిగా మీ విజయాలకు ప్రేరణ ఏమిటి? గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కే లక్ష్యంతోనే 43 చిత్రాలకు దర్శకత్వం వహించారా ?

తెలుగులోకి టెంపర్ రీమేక్ అయోగ్య అవసరమా..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయోగ్య టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎంత హిట్టయిందో తమిళ్ రీమేక్ కూడా అదే రేంజ్ లో హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కు మంచి ఫాలోయింగే ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా తన సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నాడు.

ప్రభాస్ ను రికమెండ్ చేసిన యష్..!
నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ను ఏంటి యష్ రికమెండ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అసలు స్టోరీ ఏంటంటే.. కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో యష్ కన్నడ తో పాటు తెలుగు, హిందీ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కలెక్షన్ల పరంగా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక యష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. కన్నడ స్టార్ డైరక్టర్ ఒకరు యష్ ని ఓ ఇంట్రస్టింగ్ స్టోరీతో, పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథతో ఎప్రోచ్ అయ్యారట. కేజీఎఫ్ సినిమాను మించిన కథ అవుతుందని యష్ కి ఆ డైరెక్టర్ చెప్పాడట.

విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, చైతన్య రథం వంటి విప్లవ చిత్రాల ద్వారా ఒక తరం యువతను విపరీతంగా ప్రభావితం చేసిన విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు ఈరోజు మాతృవియోగం సంప్రాప్తించింది.86 సంవత్సరాల ఆయన తల్లి గారు శ్రీమతి ధవళ సరస్వతి ఈరోజు ఉదయం నర్సాపూర్ లో కన్నుమూసారు. అద్భుత కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో సన్మానాలు పొందిన ప్రముఖ శిల్పి ధవళ సూర్యారావు ఆమె భర్త.
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.
అన్నాదమ్ముళ్లు ఎనిమిదేళ్ల తరువాత
తమిళ ఇండస్ట్రీలో ఒకరు నటుడిగా.. ఒకరు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రదర్స్ ధనుష్, సెల్వ రాఘవన్ అని చెప్పొచ్చు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో హిట్ మూవీస్ కూడా వచ్చాయి. కాదల్ కొండియన్ (తెలుగులో నేను అనే సినిమా చేశాడు అల్లరి నరేష్), పుదుపెట్టయ్, మయక్కమ్ ఎన్న అనే మూడు సూపర్ హిట్ ఫిలింస్ వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషనల్ లో సినిమా రాబోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్
తెలుగు సినీ పరిశ్రమ అనే కానీ.. ఇక్కడ హవా చాటుతున్నది మాత్రం వేరే రాష్ట్రాల హీరోయిన్స్ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, బొంబాయి ఇలా పలు ప్రాంతాల నుండి హీరోయిన్స్ దిగుమతి అవుతుంటారు టాలీవుడ్ కి. ఇక్కడ లక్ కలిసొచ్చి ఒక్క సినిమా హిట్ అయిందా ఇక అంతే ఇక్కడ వరుసపెట్టి అవకాశాలు వచ్చేస్తాయి. అలా పక్క రాష్ట్రాల నుండి మన ఇండస్ట్రీ కి వచ్చి తిష్ట వేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు హీందీ వాళ్లు హవా చేస్తే... ఆ తరువాత మలయాళీ ముద్దు గుమ్మలు.. ఇప్పుడు కన్నడ భామలు తెలుగులో తమ హవా కొనసాగిస్తున్నారు.
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ
ఒరునాళ్ కూత్తు తమిళ మూవీ తో కోలీవుడ్ లో ఎంటరయిన తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ నటించిన ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్ తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్... పలు భాషల్లో సినిమాలను నిర్మించినప్పటికీ లేడీ డైరెక్టర్ల కాంబినేషన్స్‌లో తెరకెక్కించిన సినిమాలు తక్కువనే చెప్పాలి. సరిగ్గా ఐదేళ్ళ క్రితం శ్రీప్రియ దర్శకత్వంలో `దృశ్యం`ని (2014) నిర్మించగా... మళ్ళీ ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో `ఓ బేబీ`ని నిర్మించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావుకి అచ్చొచ్చిన కథానాయికల్లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం `వేటగాడు`. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో జగ్గయ్య, కాంతారావు, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నగేష్, చలపతిరావు, పుష్పలత, పండరీబాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జున్‌రాజు, కె.శివరామరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వరకర్త చక్రవర్తి అందించిన బాణీలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా పలు కుటుంబకథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘లక్ష్యం’ ఒకటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీవాస్ దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు. జగపతిబాబు, కళ్యాణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ‘ఆహుతి’ ప్రసాద్, యశ్‌పాల్ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించారు.

రామ్ జోడీగా నివేదా?
‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నివేదా పేతురాజ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ‘చిత్రలహరి’తోనూ ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’తో మరోసారి ప్రేక్షకులను అలరించిన ఈ భామ... బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అమ్మడు... బన్నీ హీరోగా నటించనున్న ‘ఐకాన్’లోనూ ఓ నాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ‘చిత్రలహరి’ వంటి సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కిషోర్…
దర్శకురాలిగా నా సక్సెస్ కు ప్రధాన కారణం నాలోని కమర్షియల్ యాటిట్యూడే...
* హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న టైమ్ లోనే మీరు దర్శకురాలిగా టర్న్ అయ్యారు... దర్శకత్వం వహించాలన్న ఆశయమే మిమ్ములను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించింది కదా.. ఆ ఆశయానికి అంకురార్పణ ఎలా జరిగింది? దర్శకురాలిగా మీ అనుభవాలు ఏమిటి ?