ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనుక డైరెక్టర్, హీరో హీరోయిన్ల కష్టం ఎంత ఉంటుందో.. సాంకేతిక నిపుణుల కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. సినిమాకు డైరెక్షన్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా అన్నీ 24 ఫ్రేమ్ లు సమపాళ్లలో కుదిరితేనే ఒక సినిమా రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా.. అసలు మ్యాటరేంటంటే.. దర్శకుల కోరుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అందించగలిగే కొద్ది మందిలో శ్రీనివాస్ మోహన్ ఒకరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాహుబలి, రోబో, క్రిష్, ఐ లాంటి చిత్రాల వెనుక శ్రీనివాస్ మోహన్ కష్టం కూడా దాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా ఆయన ఎన్నో చిత్రాలకు పనిచేసారు. అలాంటి శ్రీనివాస్ మోహన్ కష్టానికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే ది అకాడమీ సంస్థ పేరు వినే ఉంటారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్యానెల్స్ కు సంబంధించి నిపుణలను గుర్తించి.. వారికి సభ్యత్వం ఇస్తుంది. అలా ఈ సంస్థ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 842 కొత్త సభ్యులని ప్రకటించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జాబితాలో ఇండియా నుంచి శ్రీనివాస్ మోహన్, అనుపమ్ ఖేర్ ఎంపికయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్యానల్ లో శ్రీనివాస్ మోహన్ సభ్యుడయ్యారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా వేదికగా శ్రీనివాస్ మోహన్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఈయనే విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు.
Great news sir… Congratulations 🙂 https://t.co/XdQHD9a3va
— RRR Movie (@RRRMovie) July 2, 2019
[subscribe]
[youtube_video videoid=riR1JMtXlWk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























