సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్

2019 Latest Telugu Movie News, Huge Cut out at RTC X Roads For Samantha, Samantha Fans Arranged Huge Cut Out At Cross Roads, Actress Samantha Cut Out for Oh Baby Movie, Oh Baby Movie Latest News, Samantha Upcoming movie Updates, Fans build a huge royal cutout of Samantha Akkineni, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Huge Cut-out at RTC X Roads For Samantha

ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా… సమంత ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం ఆమె ఎంచుకునే కథలు కూడా కారణమే అని చెప్పొచ్చు. అందుకే దాదాపు ఎక్కువ హిట్ సినిమాలనే తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్ దక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం సమంత ఓ బేబి సినిమాతో బిజీగా ఉంది. ఈనెల 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో బిజీ బిజీగా ప్రమోషన్ కార్యక్రమాల్లో గడుపుతుంది. ఈ నేపథ్యంలో సమంతకు ఏకంగా పెద్ద కటౌట్ నే పెట్టేశారు. టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టినట్టు.. సమంతకు కూడా హైదరాబాద్ లోని దేవి 70ఎమ్ఎమ్ థియేటర్ వద్ద పెద్ద కటౌట్ ను పెట్టారు. మరి ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ కు దక్కని ఘనత సమంతకు దక్కిందంటే.. సమంతకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను…సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఓ అతిథి పాత్ర‌లో అడివి శేష్ కూడా క‌నిపించ‌నున్నాడు.

మరి గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `యూ ట‌ర్న్‌` వంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల‌ను పోషించిన సమంత ఇప్పుడు ఓ బేబి సినిమాలో మరో డిఫరెంట్ రోల్ తో వస్తుంది. మరి ఈ సినిమా సమంతకు ఎలా కలిసొస్తుందో చూద్దాం? ఈ సినిమా కూడా హిట్ అయితే సమంత రేంజ్ ఇంకెంత పెరిగిపోతుందో…

[subscribe]

[youtube_video videoid=D4x6CeRV5Bc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.