హైదరాబాద్ లో గోపిచంద్ ‘చాణక్య’

2019 Latest Telugu Movie News, Gopichand upcoming movie updates, Gopichand chanikya movie shooting updates, chanikya movie shooting details, Director Thiru chanakya movie details, Chanakya Movie Shooting in Hyderabad,Gopichand Chanakya Movie Scheduled in Hyderabad, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Gopichand Chanakya Movie Latest Updates

తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘చాణక్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గతంలో ఇండో పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో శరవేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో మరో లుక్ ను రిలీజ్ చేశారు. మ్యాచో లుక్‌ తో ఉన్న గోపిచంద్ లుక్ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ కు ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=9jOVc1hBOEE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =