దుష్ట – శిష్ఠ- విశిష్ట పాత్రలెన్నింటినో పాదాక్రాంతం చేసుకున్న అభినయ ఘనాపాటి ఎస్వీ రంగారావు

2019 Latest Telugu Movie News, S V Ranga Rao A Lodestar In The Telugu Film Firmament, S V Ranga Rao Birth Anniversary Special, Tollywood legend Actor S V Ranga Rao Birth Anniversary, Remembering Legendary Actor SV Ranga Rao on his Birth Anniversary, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, SV Ranga Rao 101st Birth Anniversary
Remembering Legendary Actor SV Ranga Rao on his Birth Anniversary

కొందరు వ్యక్తుల గురించి, వారు సాధించిన విజయాల గురించి , వారు నెలకొల్పిన ప్రమాణాల గురించి ఎన్ని సార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలా ఎంత చెప్పినా… ఎన్నిసార్లు చెప్పినా తనివితీరని గొప్ప విశేషాల సమాహారమే  నట సార్వభౌమ ఎస్వీ రంగారావు జీవిత చరిత్ర.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీవిత చరిత్ర అంటే ఆయన పుట్టిన ఊరు, ఆయన పుట్టిన తేదీ, చదువు, పెళ్లి, పిల్లలు, నటించిన సినిమాల లిస్టు వంటి బయోడేటా డీటెయిల్స్ కాదు.  సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో ఆయన పోషించిన అనేకానేక విశిష్ట, విలక్షణ పాత్రల విశ్లేషణ… వాటిని ఆయన రక్తికట్టించిన విధాన వర్ణన.

ఆ పాయింట్ వ్యూ లో ఎస్వీ రంగారావు నట విశ్వరూప విస్తృతిని విశ్లేషించటం గొప్ప సాహసమే అవుతుంది. ఎందుకంటే మాటలకందని మహోన్నత అభినయ సామర్థ్యం ఆ మహానటుడి సొంతం. పాత్ర స్వభావ, స్వరూపాలు సవాలు విసిరిన ప్రతి సందర్భంలోనూ తన అసమాన అభినయ ప్రదర్శనతో పాత్రలనే పాదాక్రాంతం చేసుకున్నారు ఎస్వీ రంగారావు.

తను పోషించవలసిన పాత్రలో మరో నటుడిని ఊహించటానికి కూడా వీలులేనంతగా దర్శక రచయితల మస్తిష్కంలో తిష్ట వేసుకుంటారు ఎస్వీ రంగారావు. ఆ పాత్ర అంటూ చేస్తే ఆయనే చేయాలి…
ఆయనే కావాలి…. ఆయనే రావాలి.

ఇదీ… అప్పట్లో దర్శక రచయితలు, నిర్మాతలు , సహా నటీనటుల ఫస్ట్ డిమాండ్. సాధారణంగా సమకాలీన సహనటులలో  వృత్తిపరమైన ఈర్ష్య ఉంటుంది. ఎదుటి నటుడు చెలరేగిపోయి గొప్పగా నటిస్తున్నాడు అంటే అది తన ఉనికికి ప్రమాదంగా భావించే ప్రొఫెషనల్ జెలసీ దాదాపు అందరిలోనూ ఉంటుంది… ఒక్క ఎస్వీ రంగారావు విషయంలో తప్ప. దీనికి రెండు కారణాలు ఉన్నాయి….
ఎస్ వి రంగారావు నటన పట్ల విశేషమైన గౌరవాభిమానాలు..

రెండు… ఎస్వీ రంగారావు స్థాయి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆయనకు సమ ఉజ్జీ కాకపోయినప్పటికీ ఆయన అసమాన నటన కారణంగా ఆ సన్నివేశం, ఆ సినిమా గొప్పగా ఎలివేట్ అవుతాయి…అందులో తాను భాగమే కాబట్టి. అందుకే ఆనాటి తెలుగు తమిళ చిత్ర రంగాల అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఎస్వీ రంగారావు డేట్స్ కోసం పడిగాపులు పడిన సందర్భాలు ఎన్నో…

కానీ… ఎక్కడ ఎస్ వి రంగారావు అంటే… అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ మేనేజర్లు  ఎక్కడా… ఎక్కడా అని పరుగులు పెట్టాల్సిందే. “రాయక నిర్మాతలను…. రాసి ప్రేక్షకులను ఎడిపిస్తాడు” అన్నది
ఆచార్య ఆత్రేయ మీద ఉన్న నిందా పూర్వక స్తుతి.

ఎస్ వి రంగారావు మీద ఉన్నది కూడా అలాంటి నిందే. తన బలమైన బలహీనత తాగుడు కారణంగా  సమయానికి షూటింగుకు రాకుండా  నిర్మాతలను… వచ్చాక తన మంత్ర ముగ్ద అభినయ చాతుర్యంతో ప్రేక్షకులను  ఏడిపించారు “ఎస్వీఆర్” .

నిజమే… ఎస్వీ రంగారావు తాగుడుకు బానిసే… ఒక్క  ఎస్వీ ఆరే  కాదు… మహానటి సావిత్రి, మహాకవి శ్రీ శ్రీ వంటి మహామహులు, మహానుభావులు చాలా మంది మద్యపాన మహా ప్రియులే. అయితే నేo… వారి వారి అసమాన ప్రతిభా సామర్ధ్య బలాలకు అభిమానులు అయినవారు… వారి వ్యక్తిగత బలహీనతలను ఎందుకు ఉపేక్షించలేరు… ఒకరు ఉపేక్షించినా… ఉపేక్షించకపోయినా ఆ మహా దిగ్గజాల మహిమాన్విత ప్రతిభకు వచ్చే నష్టం ఏమీ లేదు.

అయితే… ఎస్వీ రంగారావు అనే మహోన్నత నటుడు ఆ బలహీనత కారణంగా కేవలం యాభై ఆరేళ్లకే చనిపోవటం బాధాకరం.

విలక్షణ విశిష్ట నటుడిగా, నాది ఆడజన్మే, సుఖదుఃఖాలు, చదరంగం, బాంధవ్యాలు అనే నాలుగు చిత్రాల నిర్మాతగా,  వాటిలో చదరంగం, బాంధవ్యాలు చిత్రాల దర్శకుడిగా , ఆఫ్రో – ఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డు విన్నర్ గా, విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నట సింహ ఇత్యాది బిరుదాంకిత కీర్తి ప్రతిష్టలతో అలరారిన అలనాటి మేటి అభినయ మహా   మహోపాధ్యాయ ఎస్వీ రంగారావు 101 జయంతి ఈ రోజు.

1918 జూలై 3న జన్మించిన ఎస్వీ రంగారావు అనంత కీర్తిప్రతిష్టల యశశ్వి రంగారావుగా 1974 జులై, 18న పరమపదించారు.

ఆ విశ్వ నటచక్రవర్తి మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అసమాన నటనతో జీవం పోసుకున్న 260 పైగా అద్భుత పాత్రలు మన జ్ఞాపకాల నిధులుగా నిలిచిపోయాయి.

రావణ, దుర్యోధన, నరకాసుర, కీచక, దక్ష, మహోదర, భస్మాసుర, బాణాసుర, కంస, హిరణ్యాది రాక్షస పాత్రలకు రాజసాన్ని కట్టబెట్టిన అభినయ వైతాళికుడు ఎస్వీఆర్.

ఇక సమకాలీన సామాజిక పాత్రలైన అన్నా ,నాన్న, తాత, తండ్రి, బాబాయ్, గురువు, ఊరి పెద్ద వంటి పెద్ద మనసున్న పెద్దరికపు పాత్రలలో ఎస్.వి.ఆర్. కురిపించిన కరుణరసాత్మక కారుణ్య ధారలలో తడిసి ముద్దలై ,ముగ్దులై పోయారు తెలుగు తమిళ రాష్ట్రాల సినీ ప్రియులు.

ఇంతటి మహోన్నత నటనతో రెండు రాష్ట్రాల ప్రజలను రెండున్నర దశాబ్దాల పాటు ఉర్రూతలూగించి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఆ విశ్వవిఖ్యాత నటుడిని కనీసం ఒక పద్మశ్రీతో సత్కరించాలన్న ఆలోచన తట్టకపోవడం దురదృష్టకరం. అయితే  ఆయన జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయటం ఆ మహానటుడికి దక్కిన అరుదైన గౌరవం.

ఉన్నత ప్రమాణాల అత్యుత్తమ నటనకు నిఘంటువుగా భాసిల్లిన ఎస్వీ రంగారావు ఆత్మ శాంతి ని ఆకాంక్షిస్తూ ఆయన101 వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది
” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” .

[subscribe]

[youtube_video videoid=9o0rUX6ZM7c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =