కుటుంబ‌క‌థా చిత్రం “జరిగిన కథ” కు 50 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, 50 Glorious Years for Superstar Krishna Jarigina Katha, 50 years for Jarigina Katha, Superstar Krishna, Superstar Krishna movies, Superstar Krishna Success Journey in telugu Film Industry, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News

“అనుమానం పెనుభూతం” అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జరిగిన కథ’. అన్నదమ్ముల ఆదర్శం, ఆలుమగల అనురాగం, తల్లీబిడ్డల మమకారం వంటి అంశాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సినిమా. “కళావాచస్పతి” జగ్గయ్య, సూపర్ స్టార్ కృష్ణ, కాంచన ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాగయ్య, రాజనాల, రాజబాబు, బాలకృష్ణ, అల్లురామలింగయ్య, ప్రభాకరరెడ్డి, సంధ్య, విజయలలిత, మంజుల, సబిత, బేబీ రోజారమణి తదితరులు ఇతర భూమికలను పోషించారు. కె.బాబూరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగావళీ (విజేతా) ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.ప్రభాకర్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఘంటసాల మాస్టార్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాటలన్నీ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా “భలే మంచి రోజు”, “తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే”, “ఏనాటికైనా ఈ మూగవీణా” వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయి. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని కన్నడంలో ‘నన్నతమ్మ’ పేరుతో పునర్నిర్మించగా… అక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేయడం విశేషం. 1969 జూలై 4న విడుదలైన ‘జరిగిన కథ’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=fceEzp6Piy8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =