ఒకే బాట‌లో వెంకీ, ప్ర‌భాస్ చిత్రాలు

2019 Latest Telugu Movie News, Prabhas and Venkatesh Movies to have Same Plot, Prabhas and Venkatesh Movies to have similar sotry, Prabhas upcoming saaho movie updates, Venky Mama movie latest news, Venkatesh Venky Mama movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Prabhas and Venkatesh Movies to have Same Plot

ఒకే త‌ర‌హా పాయింట్‌తో ఒకే స‌మ‌యంలో రెండు చిత్రాలు తెర‌కెక్కుతుండ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే వైనం రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల విష‌యంలో జ‌రుగుతోంద‌ని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `వెంకీమామ‌` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా… మామ‌కి అల్లుడి వ‌ల్ల గండం ఉండ‌డం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట‌. జ్యోతిష్యం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి ఈ పాయింట్‌నే కీల‌క‌మైన అంశ‌మ‌ని స‌మాచారం. అయితే, ఈ వ్య‌వ‌హార‌మంతా ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని టాక్‌. ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే… `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులోనూ జ్యోతిష్యం, ఒక‌రి వ‌ల్ల మ‌రొక‌రికి గండం ఉండ‌డం అనే అంశాలు ఉంటాయట‌. అద‌నంగా… హ‌స్త సాముద్రికం అనే అంశం కూడా ఉంటుంద‌ని తెలిసింది. మ‌రి… ఒకే త‌ర‌హా పాయింట్స్‌తో వ‌స్తున్న‌ వెంకీ, ప్ర‌భాస్‌… ఆ యా చిత్రాల‌తో ఏ స్థాయిలో అల‌రిస్తారో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=bJAKvOx_UE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.