`మ‌న్మ‌థుడు 2`లో నాగ్ పాత్ర అదేనా?

2019 Latest Telugu Movie News, Nagarjuna Manmadhudu 2 Movie Character Revealed, Shades of Nagarjuna in Manmadhudu 2, Nagarjuna Character in Manmadhudu 2 movie, Manmadhudu 2 Movie Latest Updates, Nagarjuna Role From Manmadhudu 2, Nagarjuna Role Revealed In Manmadhudu 2, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Nagarjuna Manmadhudu 2 Movie Character Revealed

`మ‌న్మ‌థుడు`కి 2.0 వెర్ష‌న్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ నాయిక‌గా న‌టిస్తోంది. స‌మంత‌, కీర్తి సురేష్ అతిథి పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. `చి.ల‌.సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నాగార్జున‌, పి.కిర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నాగార్జున పాత్ర‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… `మ‌న్మ‌థుడు`లో యాడ్ కంపెనీ ఓన‌ర్‌గా క‌నిపించిన నాగ్‌… `మ‌న్మ‌థుడు 2`లో పెర్వ్యూమ్ కంపెనీ ఓన‌ర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సినిమా స్టిల్స్‌లో కొన్నింటిని అబ్జ‌ర్వ్ చేస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది కూడా. మ‌రి… 17 ఏళ్ళ క్రితం యాడ్ కంపెనీ ఓన‌ర్‌గా మెస్మ‌రైజ్ చేసిన నాగ్‌… ఈ సారి పెర్వ్యూమ్ కంపెనీ ఓన‌ర్‌గా కూడా అల‌రిస్తాడేమో చూడాలి. కాగా, ఆగ‌స్టు 9న `మ‌న్మ‌థుడు 2` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=j7B34XDQ3Bo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here