విలక్షణ నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కడారం కొండాన్’. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ‘మిస్టర్. K K’ పేరుతో ఇటీవలే కిల్లర్ లాంటి సూపర్‌హిట్ చిత్రంతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణ లో విడుదల చేయనున్నారు. కమల్‌తో ‘తూంగావనం’ (తెలుగులో ‘చీకటిరాజ్యం’)వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్ ఎం.సెల్వ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. కమల్ రెండో తనయ అక్షర హాసన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి జీబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి కనబరిచే విక్రమ్… ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కూడా ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో విక్రమ్ గెటప్ చాలా కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని ఈ నెల (జూలై) 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘కాలాపానీ’, ‘తూంగావనం’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజేష్… ఈ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
[youtube_video videoid=OVqpFOdv9Vs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























