తమిళ ఇండస్ట్రీలో ఒకరు నటుడిగా.. ఒకరు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రదర్స్ ధనుష్, సెల్వ రాఘవన్ అని చెప్పొచ్చు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో హిట్ మూవీస్ కూడా వచ్చాయి. కాదల్ కొండియన్ (తెలుగులో నేను అనే సినిమా చేశాడు అల్లరి నరేష్), పుదుపెట్టయ్, మయక్కమ్ ఎన్న అనే మూడు సూపర్ హిట్ ఫిలింస్ వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషనల్ లో సినిమా రాబోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ధనుష్ ‘అసురన్’ అనే సినిమా, దురై సెంధిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత అన్న సెల్వరాఘవన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి యస్.థాను నిర్మిస్తున్నారట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు ఎనిమిదేళ్ల తరువాత వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం.. మూడు హిట్స్ రావడంతో అప్పుడే ఈ కాంబినేషన్ పై క్రేజ్ పెరిగిపోయింది. మరి దీనిపై మరించ సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=5BepH_ipBm0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: