రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?

2019 Latest Telugu Movie News, Sree Vishnu Heroine For Ravi Teja New Movie, Ravi Teja Disco raja Movie Latest News, Tanya hope finalized for Ravi Teja Disco Raja, Tanya hope Confirmed for Disco Raja Movie,Tanya hope Selected as Heroine In Disco Raja Movie, Actress Tanya hope To Play Interesting Role In Disco Raja Movie, Telugu Filmnagar, Telugu Film News 2019, Tollywood Cinema Updates
Sree Vishnu Heroine For Ravi Teja New Movie?

‘నేను శైలజ’ చిత్రంలోని “నైట్ ఈజ్ స్టిల్ యంగ్” పాటతో నర్తకిగా వెండితెరకు పరిచయమైన భామ తాన్యా హోప్. అనంతరం ‘అప్పట్లో ఒకడున్నాడు’, ‘పటేల్ సర్’, ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటిగానూ ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈమె నటించిన కన్నడ చిత్రం ‘హోమ్‌ మినిస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా… మరో కన్నడ మూవీ ‘ఖాకి’ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే… తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో ‘డిస్కో రాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లకు అవకాశం ఉండగా… ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తున్నారు. ఇక థర్డ్ హీరోయిన్ కోసం తాన్యా హోప్‌ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. అయితే… తాన్యా ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా… ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తుండగా… యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=GoNpNb8lsPo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =