యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, చైతన్య రథం వంటి విప్లవ చిత్రాల ద్వారా ఒక తరం యువతను విపరీతంగా ప్రభావితం చేసిన విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు ఈరోజు మాతృవియోగం సంప్రాప్తించింది.86 సంవత్సరాల ఆయన తల్లి గారు శ్రీమతి ధవళ సరస్వతి ఈరోజు ఉదయం నర్సాపూర్ లో కన్నుమూసారు. అద్భుత కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో సన్మానాలు పొందిన ప్రముఖ శిల్పి ధవళ సూర్యారావు ఆమె భర్త.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నలుగురు కుమారులలో పెద్దవాడైన ధవళ సత్యం దర్శకుడిగా , రెండవ కుమారుడు ధవళ చిన్నారావ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, మూడో కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. నాలుగో కుమారుడు ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు.
కాగా తమ తల్లి స్వర్గీయ సరస్వతి గారి అంత్యక్రియలు ఈరోజు నర్సాపూర్ లో జరుగుతాయని దవళ సత్యం తెలియజేశారు.

[youtube_video videoid=Q9nhu5wYi7o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























