కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 17

2019 Latest Telugu Movie News, Raashi Khanna Signs Another Two Mega Projects, Raashi Khanna To Pair With Mega Family, Raashi Khanna to play Interesting Role, Raashi Khanna Signed Two More Projects, Raashi Khanna Latest Movie News, Raashi Khanna Next
సినిమా వార్తలు

రాశీ ఖ‌న్నా ఖాతాలో మ‌రో రెండు `మెగా` ప్రాజెక్ట్స్‌

`ఊహ‌లు గుస‌గుస‌లాడే`(2014) చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆపై ప‌లు చిత్రాల్లో న‌టించినా... `సుప్రీమ్‌`, `తొలిప్రేమ‌`తోనే సాలిడ్ హిట్స్ ద‌క్కాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలే కావ‌డం విశేషం. `సుప్రీమ్‌`లో సాయితేజ్‌కి జోడీగా న‌టించిన రాశి... `తొలిప్రేమ‌`లో వ‌రుణ్ తేజ్‌కి జంట‌గా న‌టించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజువ‌ల్ వండ‌ర్‌ ‘బాహుబలి - ది బిగినింగ్‌’కి నాలుగేళ్ళు

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. సినిమా సినిమాకి త‌న స్థాయిని పెంచుకుంటూ... అన‌తికాలంలోనే అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు జ‌క్క‌న్న‌. అలాంటి రాజ‌మౌళి కెరీర్‌లో విజువ‌ల్ వండ‌ర్స్‌గా తెర‌కెక్కిన‌ `బాహుబ‌లి` సిరీస్‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన తొలి చిత్రమే ‘బాహుబలి: ది బిగినింగ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ జాన‌ప‌ద చిత్రంలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ 'ఐకాన్' లో లీడింగ్ యాక్ట్రెస్..!

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులు బన్నీ చేతులో ఉన్నాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ చివరి దశకు రాగానే ఈ సినిమాను ట్రాక్ లో పెట్టడానికి రెడీగా ఉన్నాడు వేణు శ్రీరామ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డబ్బింగ్ షురూ చేసిన మన్మథుడు

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
#Aame, 2019 Latest Telugu Movie News, Aame Movie Latest Updates, Actress Amala On Naked Scenes in Aame Movie, Amala opens up about her nude scene act, Amala Paul Latest Movie News, Amala Paul Opens up About his Nude Scene Shooting in Aame Movie, Amal
షూటింగ్ అప్‌డేట్

ఆ సీన్స్ షూట్ లో టెన్షన్ పడ్డా

అమలాపాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడై'. తెలుగులో 'ఆమె' టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ ను చూసి ఈ సినిమాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ ఈ సినిమాలో నగ్నంగా నటించే సీన్ల గురించి..తాను నటించేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్న విషయాలు చెప్పుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
నాన్నగారు మాకు అదే చెప్పేవారు - మేఘాంష్
ఇంటర్వ్యూ

నాన్నగారు మాకు అదే చెప్పేవారు - మేఘాంష్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆనాటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి కొంత మంది ఈనాటి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో హీరో కొడుకు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. తనెవరో కాదు విలక్షణ నటుడు, రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంష్. అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో మేఘాంష్ హీరోగా తెరకెక్కిన సినిమా రాజ్ దూత్. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు గా ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్, చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయనే చెప్పాలి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Jr NTR Works Hard in Gym for RRR Movie, Jr NTR Look In RRR Movie, Jr NTR Diet Plan, Jr NTR Hard Workouts for RRR Movie, Jr NTR Latest Movie News, RRR Telugu Movie Latest News, NTR gives his efforts for RRR, Jr NTR sheds
సినిమా వార్తలు

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణ ట్రైబల్ హీరో కొమరం భీమ్ గా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. RRR మూవీ 2020 జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ బడ్జెట్ చిత్రాల టాలీవుడ్

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ మూవీస్ రూపొందించడం జరిగేది. రాజ మౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి తరువాత టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చి త్ర నిర్మాణం కొత్త పుంతలు తొక్కింది. బాహుబలి మూవీ తో తెలుగు సినిమాలు అంతర్జాతీయ మార్కెట్ ను సంపాదించుకున్నాయి. తెలుగు తో పాటు రెండు,మూడు ఇతర భాషలలో కూడా తెలుగు మూవీస్ రూపొందుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టాలీవుడ్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

Team TFNవాట్సాప్
Adivi Sesh Evaru Pre Look Revealed,Adivi Sesh Shows His Swag In Evaru Pre Look,Adivi Sesh Starrer Evaru Pre Look Out,Adivi Sesh Evaru Pre Look Release,2019 Latest Telugu Movie News, Hero Adivi Sesh Next Film, Evaru Pre Look Released, Evaru Movie Upda
సినిమా వార్తలు

ఎవరు మూవీ ప్రీ లుక్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో, రైటర్ అడివి శేష్, రెజీనా జంటగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్ పై రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎవరు ఆగస్ట్ 23వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. పివిపి సినిమా, అడివి శేష్ కాంబినేషన్ లో రూపొందిన క్షణం మూవీ విజయం సాధించింది. మరోసారి ఆ కాంబినేషన్ లో ఎవరు మూవీ రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

మూడు వారాలు... మూడు వ‌రుస విజ‌యాలు...

గ‌త కొద్ది వారాలుగా నిస్తేజంగా ఉన్న బాక్సాఫీస్‌ని ఉత్తేజ‌ప‌రుస్తూ... మూడు వ‌రుస‌ వారాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు విడుద‌లై విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశాయి. ఆ సినిమాలే... జూన్ 21న విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, జూన్ 28న రిలీజైన ‘బ్రోచేవారెవరురా’, జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’. వేర్వేరు జాన‌ర్స్‌లో వ‌చ్చిన‌ ఈ మూడు ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్ కూడా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినవే కావడం విశేషం. అలాగే ఎమోషన్స్‌కు కూడా ఎలాంటి లోటు రాకుండా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో విజయం సాధించాయి ఈ మూడు చిత్రాలు. అందుకే... ఈ చిత్ర త్ర‌యాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’... రామ్ చ‌ర‌ణ్‌కి తండ్రిగా అజ‌య్?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ నటిస్తున్న ఈ చిత్రంలో... బాలీవుడ్ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజ‌య్ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘కదలడు వదలడు’కు 50 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, “జానపద బ్రహ్మ” బి.విఠలాచార్యది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో దాదాపు 13 జానపద చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి వ‌చ్చిన జానపద చిత్రాలలో ‘కదలడు వదలడు’ ఒకటి. జయలలిత కథానాయికగా నటించిన ఈ సినిమాలో రామకృష్ణ, సత్యనారాయణ, మిక్కిలినేని, ధూళిపాల, ముక్కామల, హేమలత, ఛాయాదేవి, విజయలలిత తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరధి, కొసరాజు గీత రచన చేయగా... యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పనలో రూపొందిన బాణీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో డిఫ‌రెంట్ రోల్‌లో విజ‌య్

వైవిధ్యభ‌రిత‌మైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న‌ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... ఈ టాలెంటెడ్ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ప్లే బాయ్‌గా కనిపించనున్నాడ‌ట మ‌న రౌడీ హీరో. అయితే... ఇంతవరకు తెలుగుతెరపై వచ్చిన ప్లే బాయ్ రోల్స్ కు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఎంతో మెచ్యూర్డ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జూలై 9... తాత మ‌న‌వ‌ళ్ళ ఇండ‌స్ట్రీ హిట్స్‌

జూలై 9... నందమూరి కుటుంబానికి క‌లిసొచ్చిన తేదీల్లో ఒక‌టి. ఎందుకంటే... ఇదే రోజున ఆ కుటుంబం నుంచి రెండు వేర్వేరు త‌రాల కథానాయకులు నటించిన శ‌క్తిమంత‌మైన‌ చిత్రాలు విడుద‌లై ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఇద్ద‌రి హీరోల్లో ఒక‌రు మ‌హానటుడు యన్.టి.రామారావు కాగా... మ‌రొక‌రు ఆయ‌న మ‌న‌వ‌డు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్. ఆ చిత్రాలే `బొబ్బిలిపులి`, `సింహాద్రి`.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sandeep Reddy Vanga Clarifies About his Controversial Comments, Kabir Singh director Sandeep Reddy Vanga clarifies Rumors, Sandeep Reddy Vanga Speaks On Controversy, Director Sandeep Defends Controversial Comments, dire
సినిమా వార్తలు

నేను అలా అనలేదండి బాబు..!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో సందీప్ వంగానే దర్శకుడిగా తెరకెక్కించిన రీమేక్ కబీర్ సింగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Nagarjuna Praises Samantha Performance in Oh Baby Movie, Oh Baby receive praises from Nagarjuna, Samantha is incredible says Nagarjuna, Nagarjuna Appreciates Samantha for her Performance in Oh Baby, Nagarjuna Speaks Abou
సినిమా వార్తలు

సమంత నువ్వు ఓ అద్భుతం

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబి సినిమా 5వ తేదీన రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈసినిమాలో సమంత నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. ఏమంట లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుందో కానీ నిజంగానే ఆ పేరు సమంతకు కరెక్ట్ గా సరిపోతుంది. పెళ్లైన తరువాత కూడా హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఎవరు' ప్రీ లుక్ కు ముహూర్తం ఫిక్స్

క్షణం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో హిట్ కొట్టి.. అమీతుమీ లాంటి కామెడీ ఎంటర్ ర్టైనర్ తో ప్రేక్షకులను అలరించి.. మళ్ళీ గూఢచారి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. తాను చేసే ప్రతి సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెటిజన్ కు తాప్సీ ఛాలెంజ్

వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ హిందీతో పాటు తెలుగు కూడా తన సత్తా చాటుతుంది తాప్సీ. ఇటీవలే బద్లా సినిమాతో హిందీలో హిట్ కొట్టిన తాప్సీ.. తెలుగులో రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే సినిమాతో మరో హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం తాప్సీ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీ గా ఉంది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఓ నెటిజన్ కు ఛాలెంజ్ విసిరింది తాప్సీ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటారా..? అదేంటంటే..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nithiin And Ileana To Reunite After 10 Years, Rechipo Combo to Repeat Again After 10Years, Nithiin and Ileana Combo again After Long Time, Nithiin and Ileana Combo, Nithiin and Actress Ileana Combo Again,Nithiin and Ile
సినిమా వార్తలు

10 ఏళ్ళ త‌రువాత `రెచ్చిపో`జోడీ?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం... ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ముగ్గురు కథానాయికలకు స్థాన‌మున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం... కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కోసం క‌థానాయిక అన్వేష‌ణ‌లో ఉంద‌ని సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇప్పుడు ఆ పాత్ర కోసం టాలెంటెడ్ బ్యూటీ ఇలియానాను ఎంపిక చేశార‌ని…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`లో అవంతిక‌గా ర‌కుల్ ప్రీత్‌

“వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా”... అంటూ పెళ్లి విషయంలోనూ, అమ్మాయిల విషయంలోనూ తనదైన శైలిలో జాగ్ర‌త్త‌లు చెప్పిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ క్లాసిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి కొనసాగింపుగా మరో కొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ‘మన్మథుడు 2’.

Team TFNవాట్సాప్

షేర్