వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా ఈనెల 28వ తేదీన రిలీజై మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మరోసారి శ్రీ విష్ణు, నివేదా థామస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని ఈ సినిమాతో రుజువైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈసినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూసి ప్రశంసుల కురిపించారు. ‘బ్రోచేవారెవరురా చిత్రాన్ని చూశాను. చివరి వరకు థ్రిల్లింగా ఉండటంతో పాటు వినోదభరితంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. శ్రీ విష్ణు మంచి చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు’ అని ట్వీట్ చేశాడు.
ఇక ఈ ట్వీట్ కు నివేథా స్పందించి మరో ట్వీట్ చేసింది. ‘బన్నీ థాంక్యూ వెరీ మచ్’ అంటూ తన ట్వీట్ లో పేర్కొంది.
[youtube_video videoid=r4sjtUcov1w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.