తెలుగులోకి టెంపర్ రీమేక్ అయోగ్య అవసరమా..!

is the temper remake ayogya needed in telugu

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయోగ్య టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎంత హిట్టయిందో తమిళ్ రీమేక్ కూడా అదే రేంజ్ లో హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కు మంచి ఫాలోయింగే ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా తన సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ తను రిలీజ్ చేసే సినిమా ఏంటనుకుంటున్నారా..? అయోగ్య సినిమానే. అయోగ్య సినిమానే టెంపర్ కు రీమేక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ కు అందరూ ఫిదా అయిపోయారు. అలాంటి ఎన్టీఆర్ స్థానంలో మరో హీరోని ఊహించుకోవడం కష్టమైన పనే. అలాంటిది ఈసినిమాను మళ్లీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం అంటే టైమ్ వేస్ట్ పనే అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అసలు చేసిందే రీమేక్.. మళ్లీ దాన్నే డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం అవసరమా అనుకుంటున్నారు. మరి ఈ నెల 12వ తేదీన విడుదల కానున్న ఈసినిమా ఎంత వరకూ ప్రేక్షకులకు నచ్చుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=3EOQRxoLcF4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here