యువ కథానాయకుడు కార్తి తాజా చిత్రం `ఖైదీ` నేడు జనం ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో యావజ్జీవ ఖైదీ దిల్లీగా కార్తిగా కనిపించాడు. కట్ చేస్తే… తన తదుపరి చిత్రం కూడా థ్రిల్లర్ బాటలోనే వెళ్ళనుంది. అయితే… ఈ సారి ఫ్యామిలీ థ్రిల్లర్‌తో కార్తి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. `దృశ్యం` మలయాళ వెర్షన్‌ని (ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ వెర్షన్) రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తి వదిన జ్యోతిక ఇందులో అతనికి అక్క పాత్రలో కనిపించనుంది. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా… ఈ సినిమాకి సంబంధించిన తమిళ టైటిల్ ఇంకా ఫిక్స్ కాకపోయినా, తెలుగు వెర్షన్‌కి మాత్రం `దొంగ` అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తానికి `ఖైదీ`, `దొంగ`… ఇలా మెగాస్టార్ చిరంజీవి టైటిల్స్‌ని కార్తి బాగానే టార్గెట్ చేసుకుంటున్నాడన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























