విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది టీజర్, ట్రైలర్ ను చూస్తుంటే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి ‘రావోయ్.. రావోయ్ కథ చెప్తా.. మీకు మాత్రమే చెప్తా’ అనే సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ పాటలో విజయ్ దేవరకొండ కనిపించడం విశేషం. సినిమాలోనే కీలకమైన సందర్భంలో వచ్చే ఈ సాంగ్ ను విజయ్ దేవరకొండ మీదే చిత్రీకరించారు. ఇక వినడానికి కూడా ఈ పాట చాలా క్యాచీగా.. యూత్ ను ఆకట్టుకునేలానే ఉంది.
కాగా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ షమ్మిర్ దర్శకత్వం వహిస్తుండగా…ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. మరి చూద్దాం పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ ఈ సినిమాతో మరో హిట్ కొడుతుందో..?లేదో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























