చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇన్ని రోజులు స్క్రిప్ట్ తో కసరత్తులు చేసిన చందూ ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ విషయాన్నీ నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సరిగ్గా ఈ రోజున ‘కార్తికేయ’ రిలీజ్ అయింది. చాలా టెన్షన్ పడ్డాను. కానీ సినిమా మంచి సక్సెస్ వచ్చింది. ఇక ఈ రోజు కార్తికేయ సీక్వెల్ కు స్క్రిప్ట్ ఫైనల్ అయింది అని తెలిపాడు. చూడబోతే త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
On This day in 2014… Amid lots of Tension #Karthikeya released, and went on to become a Film I’m very proud of.
Today 2019 We have a Script for the Sequel that will begin shooting, which I’m sure will Thrill and Surprise you all.
Thanks to everyone who made this happen 🙏🏽 pic.twitter.com/yfRlFbhMxW— Nikhil Siddhartha (@actor_Nikhil) October 24, 2019
కాగా అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించనున్నారట. కొంతకాలంగా ఇటు చందు మొండేటికిగానీ .. అటు నిఖిల్ కి గాని హిట్ పడలేదు. దాంతో గతంలో తమ ఇద్దరికీ హిట్ ఇచ్చిన ‘కార్తికేయ’ కంటెంట్ తో మరోసారి విజయాన్ని అందుకోవాలనే ఆశతో వున్నారు. ఈ సీక్వెల్ తో వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























