లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత `సరిలేరు నీకెవ్వరు`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం… కాలేజ్ ప్రొఫెసర్‌గా ఆమె కనిపిస్తుందని తెలిసింది. కాగా, విజయశాంతి పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి లుక్ రివీల్ చేయని యూనిట్… ఓ స్పెషల్ డే(ట్)ని ఇందుకోసం లాక్ చేసిందట. ఆ స్పెషల్ డే మరేదో కాదు… దీపావళి. సో… అక్టోబర్ 27న విజయశాంతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మనం చూడొచ్చన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`ని అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 జనవరి 12న ఈ సినిమా తెరపైకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: