కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఎలాగూ డిసెంబర్ లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటల 50 నిముషాలకు సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేశారు. మరి
మొదట ఈ సినిమాకు ‘జడ్జిమెంట్’ అనే పేరు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘రూలర్’ అనే టైటిల్ తేరా పైకి వచ్చింది. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందా?లేక వేరే ఇంకేదైనా టైటిల్ ఉంటుందా? ఈ విషయం తెలియాలంటే 26 వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా… కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ ఏడాది చివరలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జై సింహా` మంచి హిట్ కొట్టింది.. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడతారేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























