'రామారావు ఆన్ డ్యూటీ' టైటిల్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈసినిమాపై. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…
పూర్తి వార్త చదవండి


















