‘సర్కారు వారి పాట’ 50 డేస్ కంప్లీట్..!

Sarkaru Vaari Paata completes 50 days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata latest Updates, Mahesh Babu Sarkaru Vaari Paata Completes 50days,Keerthy Suresh and Mahesh Babu latest Movie Sarkaru Vaari Paata Completes 50 Days,Sarkaru Vaari Paata Telugu Movie Completes 50days, Keerthy Suresh Latest Movie Sarkaru Vaari Paata Completes 50days,50days For Sarkaru Vaari Paata Movie,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu New Movie Updates

గత ఏడాది చివరి నుండి ఇప్పటి వరకూ సౌత్ ఇండస్ట్రీకి మంచి టైమే నడుస్తుంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే అందించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఒకటి. కరోనా వల్ల దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ బాబు సర్కారు వారిపాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురాం దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మహేష్ మేకోవర్, మహేష్-కీర్తి సురేష్ కెమిస్ట్రీ, థమన్ పాటలు ఈసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ లోనూ తన సత్తా చూపించింది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈసినిమా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. నేటితో ఈసినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు విషయాన్ని తాజాాగా చిత్ర మేకర్స్ ప్రకటించారు.

కాగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇంకా ఈసినిమాలో నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం.. మధి సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 3 =