‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Mass Song Promo Released From Ravitejas Ramarao On Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Latest Promo Song,Ramarao On Duty Movie Latest Updates, Ramarao On Duty Latest Promo Song,Ravai Teja Ramarao On Duty Movie Updates,Ravi Teja Upcoming Movie Ramarao On Duty,Ramarao On Duty Mass Song Promo Released, Ramarao On Duty Movie Mass Song,Ravi Teja,Hero Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja New Movie Ramarao On Duty Latest Updates,Mass Song From Ramarao On Duty Promo Released

మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈఏడాది ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక అవేమీ పట్టించుకోకుండా వెంటనే తన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్ ప్లాన్ లో ఉన్నారు. వాటిలో ముందు రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ సినిమా. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించారు. ముందు ఈసినిమాను జూన్ 17 న విడుదల చేయాలని అనుకున్నారు. ఆతర్వాత జూలై 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా.. తాజాగా మూడో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి మాస్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ‘నా పేరు సీసా’ అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ ను జులై 2న రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nineteen =