ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో కంటే మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతూ రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా జులై 29వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ వరుస అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ‘బుల్ బుల్ తరంగ్’, ‘సొట్ట బుగ్గల’ అంటూ రెండు పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. “నా పేరు సీసా .. ఒకరికి నే తేనెసీసా .. ఒకరికి నే కల్లుసీసా .. ఒకరికి నే మసాలా సీసా .. ఇంకొకరికి రసాల సీసా .. అందరికీ అందించేస్తా స్వర్గానికి వీసా’ అంటూ వచ్చే ఈ మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈపాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. శ్రేయా ఘోషల్ ఆలపించింది.
Here we go ! The next one from #RamaRaoOnDuty 🔥#NaaPeruSeesa Lyrical Video !
– https://t.co/zmYNGwNpoB@directorsarat #AnveshiJain @SamCSmusic @shreyaghoshal @boselyricist @RTTeamWorks @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/oLUb3QS4If— Ravi Teja (@RaviTeja_offl) July 2, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరి ఈసినిమాతో రవితేజ హిట్ కొడతాడో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: