‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ముందు జులై8 వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను మరో రెండు వారాలు పొడిగించారు. జులై 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మరోవైపు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు. ఫేర్ వెల్ సాంగ్ అంటూ మూడో పాటను రిలీజ్ చేశారు ‘అమ్మ నాన్నతో ఓ ఐదేళ్లు… గల్లీ గ్యాంగ్ తో ఓ ఐదేళ్లు.. హైస్కూల్ మేట్స్ తో ఇంకో ఐదేళ్లు’ అంటూ సాగే ఈ ఫేర్ వెల్ సాంగ్ ఈ పాట ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు.
Here’s the 3rd single from the album #Farewell song out now!
▶️ https://t.co/ziJjoiavz7#ThankYouTheMovie @Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @RaashiiKhanna_@BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/XUhr6FbrLj
— chaitanya akkineni (@chay_akkineni) June 27, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: